న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా జెర్సీ నిలవబోతోంది. మళ్ళీ రావా ఫెమ్ గౌతమ్ డైరెక్షన్ లో తెరక్కేక్కిన ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. అయితే సినిమా ప్రీ రిలీజ్ 26కోట్లు దాటేయడంతో వీకెండ్ కలెక్షన్స్ పైనే సినిమారిజల్ట్ ఆధారపడి ఉంది. 

ఈ నెల 19న సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ కాంచన 3 కూడా అదే రోజు విడుదల కానుంది. ఆ సినిమాపై కూడా అంచనాలు ఉండడంతో సమ్మర్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే జెర్సీ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా నాని సినిమా మంచి రేటుకు అమ్మడు పోయింది. 

మొత్తంగా 30 కోట్ల షేర్స్ రాబడితేనే నాని సినిమా కమర్షియల్ గా హిట్టయినట్లు. మరి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన జెర్సీ ఏ స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి. ఏరియాల వారీగా ప్రీ రిలీజ్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. 

నైజం+ఉత్తరాంధ్ర......10 Cr 

సీడెడ్ ....................... 3.20 Cr  

ఈస్ట్...........................1.60 Cr

 కృష్ణ.........................1.45 Cr 

 గుంటూరు.................1.80 Cr 

 వెస్ట్...........................1.25 Cr 

 నెల్లూరు.....................0.80 Cr 

 AP / TS......................20.10 Cr 

రెస్ట్ ఆఫ్ ఇండియా..... 1.90 Cr 

ఓవర్సీస్..................... 4 Cr

ప్రపంచవ్యాప్తంగా ....... 26 Cr