వరల్డ్ వైడ్ గా వీకెండ్ మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల విషయం ప్రక్కన పెడితే ఓవర్ సీస్ లో మాత్రం అదరకొడ్తోందని తేలింది.


ఓవర్ సీస్ లో మొదటి నుంచి మంచి మార్కెట్ కలిగిన తెలుగు నటులలో ఒకరు నాని. ఆయన తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 7 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన తర్వాత చాలా స్లోగా ఉందని, మెలోడ్రామా ఎక్కువైందని ఇలా రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే కలెక్షన్స్ వైజ్ మాత్రం పికప్ అవుతూ వచ్చింది. ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా వీకెండ్ మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల విషయం ప్రక్కన పెడితే ఓవర్ సీస్ లో మాత్రం అదరకొడ్తోందని తేలింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు #HiNanna చిత్రం ఓవర్ సీస్ లో ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేనాటికి ₹12 కోట్ల గ్రాస్ దాటింది. ఈ వారంలో ఈ సినిమా కొన్న వాళ్లకి లాభదాయకమైన వెంచర్ అవుతుందని అంచనా. వీకెండ్ కూడా గడవకముందే హాయ్ నాన్న సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. ఈ సినిమాతో ఓవర్సీస్ లో తన పట్టును మరోసారి నిలుపుకున్నాడు నాని. ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడం నానికి ఇది 9వ సారి. హాయ్ నాన్నతో కలిపి అతడు నటించిన 9 సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ వసూళ్లు సాధించాయి. ఈ సెగ్మెంట్ లో అందరికంటే ముందు మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ నటించిన 13 సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానం నానిదే.

ఇక కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని... మ‌రోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే ద‌ర్శ‌కుడిని ఈ సినిమాతో ప‌రిచ‌యం చేశారు. రిలీజ్ కి ముందే నాని - మృణాల్ జోడీ, ప్రోమోలు ఆక‌ట్టుకున్నాయి. (Hi Nanna) యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంలో తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాల మాత్రం చాలా మందికి నచ్చాయి. 

తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ గా అందరి చేత కంట తడి పెట్టిస్తుంది. తండ్రీ కూతుళ్ల పాత్ర‌లు ఆ ఇద్దరి నేప‌థ్యంలో పండే భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్‌. ప్ర‌థ‌మార్ధంలో ‘ఇక్క‌డ్నుంచి వెళ్లిపోదాం నాన్న’ అని చిన్నారి చెప్ప‌డం, సెకండాఫ్ లో నువ్వు నిజ‌మైన అమ్మవి కాదుగా అంటూ చిన్నారి హీరోయిన్ తో చెప్ప‌డం, ‘ఎక్క‌డ త‌ప్పు చేశాను నా ప్రేమ స‌రిపోవ‌డం లేదా’ అని చిన్నారితో విరాజ్‌ చెప్పే సంద‌ర్భాలు క్లైమాక్స్ స్థాయి,ఎమోషన్స్ ని పండిస్తాయి.మేకర్స్. నాని కూడా ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని ప్రమోషన్స్ చేస్తున్నాడు.