న్యాచురల్ స్టార్ నాని బాక్స్ ఆఫీస్ హిట్ చూసి చాలా కాలమవుతోంది. నేను లోకల్ - నిన్ను కోరి సినిమాల తరువాత నాని పెద్దగా లాభాలను అందించే చిత్రాలను చేయలేదు. జెర్సీ - గ్యాంగ్ లీడర్ పాజిటివ్ కామెంట్స్ అందుకున్నప్పటికి అంచనాలకు తగ్గట్టుగా ప్రాఫిట్స్ అందించలేకపోయింది. దీంతో నాని నెక్స్ట్ ప్రాజెక్టులపై దీర్ఘంగా దృష్టి పెట్టాడు. కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో నానికి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం 'భలే భలే మగాడివోయ్'. 

ఆ సినిమా నాని కెరీర్ లొనే అత్యధిక లాభాలను అందించింది. డైరెక్టర్ మారుతి కూడా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. మారుతి, నాని కాంబినేషన్ మళ్ళీ పట్టాలెక్కనున్నట్లు టాక్ వస్తోంది. ఇటీవల మారుతి సాయి ధరమ్ తేజ్ తో తీసిన ప్రతి రోజు పండగే బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా సక్సెస్ తరువాత నాని మారుతిని స్పెషల్ గా కలిసినట్లు టాక్. అప్పుడే ఒక కాన్సెప్ట్ అనుకోని సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. 

ప్రస్తుతం నాని చేతిలో రెండు సినిమాలున్నాయి. V సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా.. శివ నిర్వాణ 'టక్ జగదీష్' సెట్స్ పైకి రానుంది. ఈ రెండు సినిమాల అనంతరం టాక్సీ వాలా దర్శకుడు రాహుల్ తో నాని మరొక సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇక వీటితో పాటు మారుతి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు మారుతి రామ్ పోతినెనితో కూడా సంప్రదింపులు జరిపినట్లు టాక్ వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. మొత్తానికి నాని మారుతి కాంబో మరొకసారి కామెడీ సినిమాతో నవ్వించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.