'ఓ బేబీ' సినిమాతో సక్సెస్ అందుకున్న నందినీ రెడ్డి బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ ని తెలుగులో డైరెక్ట్ చేయబోతుందనిచాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. నాలుగు భాగాలుగా ఈ సిరీస్ ని రూపొందించనున్నారని.. అందులో ఓ భాగాన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చేయబోతుందని అన్నారు.

తాజాగా ఈ వార్తలపై స్పందించిన నందిని రెడ్డి అవి నిజం కాదని చెప్పకనే చెప్పారు. 'నెట్‌ఫ్లిక్స్‌లో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ సబ్ టైటిల్స్‌తో సహా ఉన్నప్పుడు మళ్లీ దానిని రీమేక్ చేయాల్సిన అవసరం ఏంటని..?' ప్రశ్నించారు. ‘వై అమ్మా.. ఏంటో ఈ వెరైటీ రూమర్స్’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దీన్ని బట్టి ఆమె ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయడం లేదని తెలుస్తోంది.

తరువాత అవకాశం వస్తే మరి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నాలుగు రోజుల క్రితం నందిని రెడ్డి తన తదుపరి సినిమాను అనౌన్స్ చేసింది. 'మహానటి' సినిమాను రూపొందించిన నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంక దత్ లతో కలిసి నందిని రెడ్డి ఓ సినిమా చేయబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లవ్ స్టోరీ నేపధ్యంలో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు.

రొటీన్ కథనైనా సరికొత్త స్టైల్ లో వెండితెరపై ఆవిష్కరించడం నందిని రెడ్డి స్పెషల్. తన తదుపరి సినిమా కూడా ఆడియన్స్ ని కొత్త ఫీలింగ్ ని కలిగిస్తుందని అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు.