నందమూరిబాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న రూలర్ చిత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా, కార్పొరేట్ సంస్థ అధినేతగా రెండు గెటప్స్ లో కనిపిస్తున్నాడు. 

రవికుమార్ ఈ చిత్రాన్ని మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్స్, ట్రైలర్స్..  కార్యక్రమాలు సినిమాపై మంచి బజ్ ఏర్పరిచాయి. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో తాజాగా రూలర్ మూవీ కీలకమైన సెన్సార్ ప్రక్రియని పూర్తి చేసుకుంది. 

సెన్సార్ బోర్డు రూలర్ చిత్రానికి 'యూఏ' సర్టిఫికేట్ అందించారు. దీనితో రూలర్ చిత్రం డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ఇద్దరు హాట్ బ్యూటీలు సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. 

చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రూలర్ మూవీలో ఎక్కువగా రైతుల అంశాన్ని టచ్ చేసినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు.. ఇద్దరు ముద్దుగుమ్మలతో బాలయ్య స్టెప్పులు వేసి అలరించబోతున్నాడు. సి కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. భూమిక, జయసుధ కీలక పాత్రల్లో నటించారు.