నందమూరి బాలకృష ప్రస్తుతం రూలర్ సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త స్టైల్ లో బాలయ్య కనిపించబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక కొన్ని లుక్స్ పై ట్రోల్స్ కూడా వచ్చాయి. వాటి సంగతి పక్కనపెడితే సినిమా మాత్రం ఎంతో కొంత బజ్ ని క్రియేట్ చేస్తోంది.

టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 15న హైదరాబద్ లో ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే వేడుకకు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారట. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు డిజాస్టర్ ఆకావడంతో రూలర్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని బాలయ్య కష్టపడుతున్నాడు.

బాలకృష్ణ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్పులతో దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సాంగ్స్ ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. కెఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించగా చినంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ సరసన వేదిక - సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.