Asianet News TeluguAsianet News Telugu

#Bimbisara:‘బింబిసార’OTT పార్ట్నర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి.?

కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'బింబిసార' ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.  

 Nandamuri Kalyanram Bimbisara Telugu Movie OTT release date
Author
Hyderabad, First Published Aug 23, 2022, 11:36 AM IST


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ట్రేడ్ పండితులను ఆశ్యర్యపోయేలా చేసిన సంగతి తెలిసిందే.  18వ రోజు ఈ సినిమా రూ. 60 కోట్ల క్లబ్బులోకి అడుగెట్టి అదరకొట్టింది. తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్ పార్ట్నర్ కి సంబంధించి అప్డేట్ బయిటకు వచ్చింది.  

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని కూడా ప్రముఖ ఓటిటి యాప్ జీ5 వారే కొనుగోలు చేసారు. ఇక అలాగే ఈ సినిమా స్ట్రీమింగ్ కూడా  50 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత వస్తుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు.  

ఇక యూఎస్‌లో మొదటిసారి వన్ మిలియన్ యూస్ డాలర్స్ దిశగా దూసుకుపోతుంది. బింబిసార మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 7.27 కోట్లు షేర్ ( రూ. 11.50 కోట్ల గ్రాస్) రాబట్టింది. రెండో రోజు ఈ సినిమా రూ. 5.10 కోట్లు షేర్ (రూ. 8.50 కోట్ల గ్రాస్) మూడో రోజు ఈ సినిమా రూ. 5.92 కోట్లు షేర్ (రూ, 10 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. నాల్గో రోజు ఈ సినిమా రూ. 2.56 కోట్లు (రూ. 4.30 కోట్లు), ఐదు రోజు రూ. 2.77 కోట్లు (రూ. 4.70 కోట్ల గ్రాస్), ఆరో  రోజు రూ. 1.22 (రూ. 2.10 కోట్లు), ఏడో రోజు 0.73 కోట్లు (రూ. 1.20 కోట్లు) రాబట్టింది. 

నందమూరి కళ్యాణ్ రామ్  హీరోగానే  కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా  నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara) . ఈ సినిమాలో కళ్యాన్ రామ్ సరసన హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు.ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 2.09 కోట్ల లాభాల్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఓవరాల్‌గా 17 రోజుల్లో  ఈ సినిమా రూ. 19.15 కోట్లు లాభాల్లోకి వచ్చింది. టోటల్ రన్‌లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. 

ఈ కథ రెండు వేర్వేరు కాలాల్లో జరుగుతుంది. రెండు కాలాల్లో ఒక నిధిని ఒకే సమయంలో తెరవడానికి జరిగే ప్రయత్నమే ఈ సినిమాకి హైలైట్. పాటల పరంగా ఈ సినిమా కాస్త వీక్ అయినప్పటికీ, కథాకథనాల పరంగా .. విజువల్స్ పరంగా లాక్కొచ్చేసింది. త్వరలోనే ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios