యంగ్ హీరోల హవా పెరిగిన తరువాత సీనియర్ హీరోల క్రేజ్ కాస్త తగ్గింది. సినిమాలో మంచి కంటెంట్, హీరో పాత్ర నచ్చితే తప్ప సినిమాలు చూడడం లేదు. ఇటీవల నాగార్జున 'మన్మథుడు 2' అంటూ లేట్ ఏజ్ లో రొమాన్స్ చేసే పాత్రలో నటించారు. అతడి కుర్రవేషాలు చూడలేని జనం సినిమాని ఫ్లాప్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి తన సొంత బ్యానర్ లో క్రేజీ కాంబినేషన్స్, భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తూ పర్వాలేదనిపించుకుంటున్నారు. వెంకటేష్ మల్టీస్టారర్ కథలను నమ్ముకొని హిట్స్ అందుకుంటున్నారు. నాని, ఎన్టీఆర్ లాంటి హీరోలతో సినిమాలు చేయాలనుందంటూ వెంకీ స్వయంగా చెప్పారు. 

‘పింక్‌’ తెలుగు రీమేక్.. రిలీజ్ టైమ్ ఫిక్స్!

ఇక బాలకృష్ణ విషయానికొస్తే.. ఆయన నటించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' మరే సినిమాకి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం ఆయన నటించిన 'రూలర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాకి సరైన బజ్ లేదు. అసలు బజ్ వస్తుందనే సూచనలు కూడా కనిపించడం లేదు.

అదే రోజు వస్తున్న 'ప్రతిరోజు పండగే' సినిమా పబ్లిసిటీ విషయంలో దూసుకుపోతుంది. కానీ 'రూలర్' మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అప్పటికీ సినిమా నుండో రెండో ట్రైలర్ కూడా వదిలారు. మొదటి ట్రైలర్ కంటే రెండో ట్రైలర్ అంత కొత్తగా ఏమీ లేదు. అవే రొటీన్ డైలాగులు, రొటీన్ ఫైట్లు చూపించారు. కొత్త జెనరేషన్ సినిమాలు వస్తున్న కాలంలో నాగార్జున, వెంకీ, చిరులు తమ సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటే.. బాలకృష్ణ మాత్రం ఇంకా అదే స్టైల్ లో సినిమాలు చేస్తున్నారు.

బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతోనే 'వినయ విధేయ రామ' లాంటి సినిమా తీసిన బోయపాటి.. బాలయ్యతో సినిమా అంటే రొటీన్ బాదుడు ఉండడం కామన్. ఇప్పటికైనా బాలయ్య రెగ్యులర్ సినిమాల జోలికి పోకుండా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటే మంచిదేమో!