మా వివాదంపై నందమూరి హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫండ్ రైజింగ్ కోసం ఫస్ట్ క్లాస్ లో తిరిగారని, ఆ డబ్బంతా ఏం చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో రూసుకుని పూసుకుని తిరుగుతున్నారని అన్నారు.

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వివాదం మరింత ముదురుతోంది. తాజాగా నందమూరి హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా కార్యాలయ భవనం నిర్మాణం వి,యంలోనే కాకండా మా ఎన్నికల విషయంలోనూ ఆయన వ్యాఖ్యలు చేశారు. 

మా ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే విషయాన్ని పట్టించుకోనని ఆయన చెప్పారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ అని, సమస్యలను బహిరంగంగా చర్చించుకోవడం సరి కాదని బాలకృష్ణ అన్నారు. 

నిధుల సేకరణ కోసం ఫస్ట్ క్లాస్ లో తిరిగారని అంటూ ఆ డబ్బంతా ఏం చేశానరి ప్రశ్నించారు. మా భవనం ఎందుకున నిర్మించలేకపోయారనేదే ప్రశ్న అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు, మా భవనం కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వదా అని ఆయన ప్రశ్నించారు. 

అందరం కలిస్తే ఇంద్రభవనం నిర్మించవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. మా బిల్డింగ్ నిర్మాణం కోసం నటుడు మంచు విష్ణు ముందుకు వస్తే తాను సహకరిస్తానని బాలకృష్ణ చెప్పారు. మా ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే విషయాన్ని తాను పట్టించుకోబోనని బాలకృష్ణ చెప్పారు.