నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న ఊహాగానాలు ఈనాటివి కావు. 2009 ఎన్నికల సమయంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల జోలికి వెళ్ళలేదు. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల ఓటమితో పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ తరుణంలో పార్టీ నిలబడాలంటే జూ.ఎన్టీఆర్ రావాల్సిందే అనే వాదన కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులు ఎవరూ కూడా స్పష్టత నివ్వడానికి ఇష్టపడలేదు. 

ఛార్మి హాట్ ఫోటోస్.. మీరెప్పుడూ చూడని సెక్సీ ఫోజులు

తాజాగా నందమూరి బాలకృష్ణ జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వస్తే తెలంగాణ, ఏపీలలో టిడిపి పుంజుకుంటుందనే వాదన వినిపిస్తోంది. 

దీనిపై మీ సమాధానం ఏంటని బాలయ్యని ప్రశ్నించగా.. అది డెడికేషన్ బట్టి ఉంటుంది. ఫుల్ టైం పాలిటిక్స్ అనేది కూడా వస్తుంది. వాడికి నటుడిగా చాలా భవిష్యత్తు ఉంది.. దానిని వదులుకుని రమ్మనలేం కదా అని బాలయ్య అన్నారు.