సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. 2005లో మహేష్ బాబు, నమ్రత అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్, నమ్రత వంశీ చిత్రంలో కలసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 

నమ్రత అంతకు ముందే బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న నటి. మోడల్ గా కూడా రాణించింది. నమ్రత మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అంతకు ముందే నమ్రతకు మరొకరితో రిలేషన్ ఉందట. ఓ ఇంటర్వ్యూలో నమ్రత విషయాన్ని వెల్లడించింది. 

దీపక్ శెట్టి అనే వ్యక్తితో నమ్రత కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిందట. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. కానీ పరిస్థితుల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ సమయంలో తన జీవితంలో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయని.. కానీ వాటన్నింటినీ దాటుకుని తాను జీవితంలో ముందుకు కదిలానని నమ్రత చెప్పుకొచ్చింది. 

ఆ తర్వాత నమ్రతకు సినిమాల్లో అవకాశాలు రావడం, మహేష్ తో పరిచయం ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం మహేష్ సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో బిజీగా ఉన్నాడు. నమ్రత తల్లిగా పిల్లల బాధ్యత చూసుకుంటోంది.