టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియా ద్వారానే తన అభిప్రాయాలు పంచుకుంటున్నాడు. ఇక మహేష్ సతీమణి కూడా ఇంస్టాగ్రామ్ లో తన ఫ్యామిలీకి సంబందించిన విశేషాల్ని షేర్ చేస్తూ ఉంటుంది. 

తాజాగా నమ్రత తొలిసారి మహేష్ బాబు జిమ్ వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. దీనితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మహేష్ బాబు రన్నింగ్ కు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. పోకిరి చిత్రంలో మహేష్ బాబు రన్నింగ్ చూసి ఫిదా కానివారు లేరు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Running to perfection ♥️♥️♥️ daily dose of exercise!! @urstrulymahesh #StayHome #StayFit #Lockdowndiaries

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 27, 2020 at 10:22am PDT

తన జిమ్ లో మహేష్ బాబు థ్రెడ్ మిల్ పై రన్నింగ్ చేస్తున్న వీడియో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. రన్నింగ్ లో ఫర్ఫెక్షన్.. రోజూవారి కోటా జిమ్ వర్కౌట్ అంటూ లవ్ ఎమోజిలతో నమ్రత పోస్ట్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

The Lion’s den !! #stayhomestaysafe

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 21, 2020 at 8:51pm PDT

మహేష్ బాబు జిమ్ లోకి ఎంటర్ అవుతున్న మరో వీడియోను కూడా నమ్రత పోస్ట్ చేసింది. సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు లాక్ డౌన్ తర్వాత  గీతగోవిందం ఫేమ్ పరుశురాం దర్శత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.