ప్రస్తుతం ప్రపంచమంత ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడి విలవిల లాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది ఈ వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతుండగా దాదాపు 3 లక్షల మంది రికవర్‌ కాగా, 70 వేల మందికి పైగా మరణించారు. ఈ మేరకు జాన్‌ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్‌లో ఏకంగా 21 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ప్రకటించారు.

అత్యవసరాల కోసం బయటికి వచ్చేవారికి కూడా సోషల్ డిస్టాన్స్ మెయిన్‌టెయిన్‌ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు నాగ్‌పూర్‌ పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. సోషల్ మీడియాలో చెన్నైఎక్స్‌ ప్రెస్ సినిమాలోని షారూఖ్‌ ఖాన్, దీపికా పదుకొనేల ఫోటోను పోస్ట్ చేసి ప్రజల్లో అవేర్‌నెస్ కలిగిస్తున్నారు.

ఈ ఫోటోలో రైల్వే స్టేషన్‌లోని బెంచ్‌ మీద షారూఖ్‌ ఒక ఎడ్జ్‌లో కూర్చోగా దీపికా మరో ఎడ్జ్‌లో కూర్చొని ఉంటుంది. ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని సోషల్ డిస్టాన్సింగ్‌ అంటూ చూపిస్తూ ప్రమోషన్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో సోషల్ డిస్టాన్సింగ్‌ తప్ప మరో అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలలో అవగాహన కల్పించేందుకు అధికారులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.