Asianet News TeluguAsianet News Telugu

`వైల్డ్ డాగ్`తో నాగ్ నిజంగానే ప్రయోగం!

ఊపిరి చిత్రం తర్వాత నాగ్ కు సరైన హిట్ పడలేదు. ముఖ్యంగా ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన `మన్మథుడు-2` డిజాస్టర్ ఫలితంతో  నిరాశ చెందిన `కింగ్` నాగార్జున కొంత కాలం గ్యాప్ తీసుకున్నారు. 

Nagarjunas Experiment with Wild Dog
Author
Hyderabad, First Published Dec 29, 2019, 5:51 PM IST

ఊపిరి చిత్రం తర్వాత నాగ్ కు సరైన హిట్ పడలేదు. ముఖ్యంగా ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన `మన్మథుడు-2` డిజాస్టర్ ఫలితంతో  నిరాశ చెందిన `కింగ్` నాగార్జున కొంత కాలం గ్యాప్ తీసుకున్నారు. `బిగ్‌బాస్` మూడో సీజన్‌తో బిజీ అయ్యి...ఇప్పుడు  నూతన దర్శకుడు అహిషోన్ సోలమన్ సినిమాకు ఓకే చెప్పారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్‌లుక్ తాజాగా బయటకు వచ్చింది. ఈ సినిమాకు `వైల్డ్‌డాగ్` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంపై నాగ్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగ కాకుండా విభిన్నంగా ఓ ప్రయోగం గా ఉండనుందని తెలుస్తోంది. ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా ఈ సినిమాలో నాగ్ కనపడనున్నారు. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. కేవలం రీరికార్డింగ్ కోసమే సంగీత దర్శకుడుని తీసుకుంటున్నట్లు సమాచారం.

అలాగే  ఈ చిత్రంలో ప్రత్యేకమైన కామెడీ కానీ, హీరోయిన్ కానీ ఉండదు. ఓ హాలీవుడ్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించలేదు. అలాగే పాటలు ఉండవు కాబట్టి రీరికార్డింగ్ బాగా ఇచ్చే వారిని సంగీత దర్శకుడుగా తీసుకోబోతోన్నట్లు సమాచారం.

`గగనం` తర్వాత నాగార్జున ఇలాంటి ప్రయోగం తరహా పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ , తక్కువ వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసి 2020 వేసవిలో రిలీజ్ చేయబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios