Asianet News TeluguAsianet News Telugu

నాగ్ కు వేరే ఆప్షన్ లేదు.. ఓటీటిలోకే!

‘మన్మథుడు 2’ తో వెనకబడ్డ నాగార్జున.. ప్రస్తుతం అహిషోర్ సోలోమన్ దర్శకత్వ్ంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు.  కొద్ది కాలం క్రితం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మీర్జా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం.  ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది.కానీ ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు. ఇక కరోనా వైరస్ వైరస్ ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది. అక్కడ కొన్ని కేసులు నమోదు అవుతున్నాయి.

Nagarjuna wild dog on OTT platforms directly
Author
Hyderabad, First Published Jun 8, 2020, 10:43 AM IST

‘మన్మథుడు 2’ తో వెనకబడ్డ నాగార్జున.. ప్రస్తుతం అహిషోర్ సోలోమన్ దర్శకత్వ్ంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు.  కొద్ది కాలం క్రితం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మీర్జా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం.  ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది.కానీ ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు. ఇక కరోనా వైరస్ వైరస్ ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది. అక్కడ కొన్ని కేసులు నమోదు అవుతున్నాయి.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను వాయిదా వేసింది. కరోనా వైరస్ తీవ్రత తగ్గేవరకు చిత్ర బృందం థాయ్‌లాండ్ వెళ్లవద్దని నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్దితులు కనపడటం లేదు. అసలు హైదరాబాద్ లో షూటింగ్ జరపటమే కష్టంగా ఉంది.  అయితే ఈ సినిమా ఎనభై శాతం షూట్ ఫినిష్ అయ్యి ఉండటంతో.. మిగతా షూటింగ్ ని కొద్ది రోజుల్లో హైదరాబాద్ లోని తమ అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి అన్ని  జాగ్రత్తలూ తీసుకుని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే థియోటర్ రిలీజ్ లు పరిస్దితి లేకపోవటంతో ఓటీటికి ఈ సినిమా ఇచ్చేస్తున్నట్లు సమాచారం. 26/11 ముంబై దాడుల నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. 

ఇక ఈ సినిమాలో ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌వర్మ గా నాగ్ కనిపిస్తారు.  నూతన దర్శకుడు అషిషోర్‌ సోల్మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’.  వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. కేవలం రీరికార్డింగ్ కోసమే సంగీత దర్శకుడుని తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో ప్రత్యేకమైన కామెడీ కానీ, హీరోయిన్ కానీ ఉండదు. ఓ హాలీవుడ్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించలేదు. అలాగే పాటలు ఉండవు కాబట్టి రీరికార్డింగ్ బాగా ఇచ్చే వారిని సంగీత దర్శకుడుగా తీసుకోబోతోన్నట్లు సమాచారం.

 `గగనం` తర్వాత నాగార్జున ఇలాంటి ప్రయోగం తరహా పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ , తక్కువ వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసి అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: షానీ డియోల్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios