నాగ చైతన్య - సమంత మరోసారి జంతగా నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏ మాయ చేసావే సినిమాతో మొదటిసారి సినిమా చేసి సక్సెస్ అందుకున్న ఈ జంట ఆ తరువాత ప్రేమించుకొని వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. చైతు - సమంతా నటించిన ప్రతి సారి ఆ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఆటో నగర్ సూర్య తప్పితే మిగతా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి.  మనం - మజిలీ సినిమాలు నాగచైతన్య కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చాయి. ఇకపోతే మనం తరహాలో మరోసారి అక్కినేని కుటుంబ సభ్యులు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమాను తెరకెక్కించబోతున్నాడు.

'సైరా' చూడరని చిరుకి ముందే చెప్పా కానీ.. నటుడు గిరిబాబు కామెంట్స్!

అయితే సినిమాలో నాగ చైతన్య కూడా నటించబోతున్నాడు. ఇక చైతు సరసన సమంతను కూడా నటింపజేయాలని నాగ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కుదిరితే స్పెషల్ సాంగ్ లో అఖిల్ ని దింపాలని ఆలోచిస్తున్నారు. మనం సినిమాలో ఒక యాక్షన్ సీన్ లో అఖిల్ తాత ఏఎన్నార్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ముగ్గురు అక్కినేని హీరోలు అలాగే సమంత బంగార్రాజు సినిమాలో కనిపించే అవకాశం ఉందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు బిజీగా ఉన్నాడు. కథలో ఇంకా మార్పులు చేయాలనీ నాగ్ దర్శకుడిని కోరినట్లు  ఒక టాక్ కూడా వచ్చింది. వీలైనంత త్వరగా సినిమాని డిసెంబర్ లోనే మొదలుపెట్టి సమ్మర్ అనంతర ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగార్జున ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. .