కింగ్ నాగార్జున ఊపరి చిత్రం తర్వాత వరస డిజాస్టర్స్ ఇచ్చారు. ఆయన చివరి చిత్రం మన్మధుడు 2 అయితే ఎంత ప్లాపో లెక్క కట్టడం కూడా కష్టమే. దాంతో ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని కథలు, దర్శకుల ఎంపికలో జాగ్రత్త పడాలనే నిర్ణయానికి వచ్చారు. డిఫరెంట్ సబ్జెక్ట్ లను ఆయన ట్రై చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం తర్వాత ఆయన ఓ బాలీవుడ్ రీమేక్ కమిటైనట్లు సమాచారం.

చందమామ కథలు, గరుడ వేగ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో బాలీవుడ్ లో వచ్చి హిట్టైన రెయిడ్ ని రీమేక్ చేయటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్‌కు బెస్ట్ ఫారిన్ యాక్టర్ అవార్డు దక్కింది. రెయిడ్ చిత్రంలో ఐటీ ఆఫీసర్‌గా అజయ్ దేవగన్ తన పాత్రను పోషించాడు. 1980 దశకంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఐటీ శాఖ దాడుల కథాంశంతో రెయిడ్ సినిమాను తీశారు. రాజ్ కుమార్ గుప్తా ఆ సినిమాను డైరక్ట్ చేశారు. చైనాలో జరుగుతున్న 27వ గోల్డన్ రూస్టర్ అండ్ హండ్రెడ్ ఫ్లవర్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ అవార్డును ప్రకటించారు.

ఈ డైరెక్టర్ బండి మీద అరటిపళ్లు అమ్మేవాడట!

'ఈ దేశంలో పేదరికం వల్ల ప్రజలు పేదలుగా మారడం లేదు. నీలా దేశం మీద పడి దోచేస్తున్న ధనికుల వల్ల ప్రజలు పేదలుగా మారుతున్నారు....వంటి డైలాగులతో  'రెయిడ్‌' చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 'హీరోలు ఎల్లప్పుడూ యూనిఫాంలలో రారు' అన్నది ఈ చిత్రం ట్యాగ్ లైన్. లఖ్‌నౌకి చెందిన ఐటీ డిప్యూటీ కమిషనర్‌ అమరు పట్నాయక్‌ పాత్రలో అజరు దేవ్‌గన్‌ నటించారు. తెలుగుకు నాగ్ కు ఏమి మార్పులు చేస్తారో చూడాలి.

 ఇక నాగ్ తాజా చిత్రం విషయానికి వస్తే..`వైల్డ్‌డాగ్`  ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మగా కనిపించనున్నారు.  ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా ఈ సినిమాలో నాగ్ కనపడనున్నారు. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. కేవలం రీరికార్డింగ్ కోసమే సంగీత దర్శకుడుని తీసుకుంటున్నట్లు సమాచారం. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ , తక్కువ వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసి 2020 వేసవిలో రిలీజ్ చేయబోతున్నారు.