కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 నేడు గ్రాండ్ ఫినాలేకు రెడీ అవుతోంది. ఆదివారం రోజు బిగ్ బాస్ 3 ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనితో విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ ఫైనల్స్ కు చేరారు. 

శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది ఉంది. కానీ సోషల్ మీడియాలో శ్రీముఖి గురించి వైరల్ అవుతున్న వార్త హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ 3 ఫైనల్ విజేత శ్రీముఖే అంటూ ఓ పిక్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బిగ్ బాస్ ప్రేక్షకుల్లో గందరగోళం నెలకొని ఉంది. 

కొందరు అభిమానులు ఇది మార్పింగ్ ఫోటో అని కొట్టిపారేస్తున్నారు.  దీనిపై నెలకొన్న గందరగోళాన్ని నాగార్జున తొలగించే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ 3 విన్నర్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు.. బిగ్ బాస్ 3 ఫైనల్ లైవ్ చూసి ఆనందించండి అని నాగార్జున ట్వీట్ చేశారు. 

బిగ్ బాస్ 3 అనేది తన జీవితంలో జరిగిన ఓ అద్భుతమైన  జర్నీగా నాగార్జున అభివర్ణించాడు. 15 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 ప్రస్తుతం 5 గురు సభ్యులకు చేరుకుంది. ఈ ఐదుగురిలోనే విన్నర్ ఎవరో తేలనుంది.