ఈ ఏడాది కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 షో సూపర్ సక్సెస్ అయింది. నాగార్జున తనదైన శైలిలో బిగ్ బాస్ షోని నడిపించాడు. ఈ సీజన్ లో బిగ్ బాస్ షోలో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో అలీ రెజా ఒకరు. మిగిలిన కంటెస్టెంట్స్ కు అలీ రెజా గట్టి పోటీ నిచ్చాడు. 

అలీ రెజా హౌస్ లో ఎప్పుడూ స్టైలిష్ గా కనిపిస్తూ ప్రేక్షకులని అలరించాడు. టాస్కులలో చురుగ్గా పాల్గొన్న కంటెస్టెంట్ కూడా అలీ రెజానే. అలీ రెజా బిగ్ బాస్ హౌస్ నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయాడు. దీనితో అలీ రెజా అభిమానులు చాలా బాధపడ్డారు. 

కానీ అలీ రెజా మరోమారు వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రతి సందర్భంలో అలీ రెజా డ్రెస్సులని, స్టైల్ ని నాగార్జున ప్రశంసించేవారు. అలా ఓ సందర్భంలో.. నాగార్జున ధరించిన షూ బ్రాండ్ కావాలని అలీ రెజా కోరాడు. తప్పకుండా బిగ్ బాస్ షో అయిన తర్వాత ఇస్తానని నాగార్జున హామీ ఇచ్చాడు. 

బిగ్ బాస్ షో పూర్తై నెల రోజులు గడిచినప్పటికీ నాగార్జున అలీ రెజాకు ఇచ్చిన మాట మరచిపోలేదు. మాట ఇచ్చిన విధంగా అలీ రేజకు  షూ బ్రాండ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. దీనితో అలీ రెజా సంతోషానికి అవధులు లేకుండా పోయింది. నాగార్జునతో కలసి దిగిన పిక్స్ ని అలీ రెజా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నాగార్జునపై ప్రశంసలు కురిపించాడు. 

నిజంగా మాటమీద నిలబడే వ్యక్తి.. నేను కోరిన విధంగా నాగ్ సర్ నాకు షూ గిఫ్ట్ గా ఇచ్చారు. నాగ్ సర్ తన మాట నిలబెట్టుకున్నారు అని అలీ రెజా పోస్ట్ చేశాడు.