నందమూరి బాలకృష్ణ ఎఫెక్ట్ నాగార్జునపై బాగా పడింది. బాలయ్య అంటేనే భయపడిపోతున్నాడు. నాగార్జున.. బాలయ్యని చూసి భయపడడం ఏంటి అనుకుంటున్నారా...? అసలు విషయంలోకి వెళ్తే.. గతేడాది ఎన్టీఆర్ జీవిత చరిత్రతో 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

బాలయ్య నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలాయి. ఎన్టీఆర్ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగడం, ఒకే సినిమాగా తెరకెక్కించాల్సిన సినిమాని రెండు భాగాలుగా రూపొందించడం వంటి విషయాలు ఈ సినిమా పరాజయానికి కారణంగా నిలిచాయి.

స్లీవ్ లెస్ బ్లౌజ్, చేతికి టాటూ... నెట్టింట రచ్చ చేస్తున్న ప్రగతి!

'మహానటుడు' ఎన్టీఆర్ జీవితంపై వచ్చిన బయోపిక్ ని ప్రేక్షకులు తిరస్కరించడంతో.. నాగార్జున కూడా తన తండ్రి అక్కినేని నాగేశ్వరావు జీవితంపై తెరకెక్కించాలనుకున్న బయోపిక్ ని ఆపేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో నాగార్జున ఒకసారి అక్కినేని నటించిన సినిమాలను రీమేక్ చేయడానికి భయపడే నేను.. ఆయన బయోపిక్ తీసే సాహసం చేయలేనని ఇన్‌ డైరెక్ట్‌గా బాలయ్యకి చురకలు అంటించాడు.

ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ అవ్వడంతో ఏఎన్నార్ బయోపిక్ తీయాలనే ఆలోచనలు పూర్తిగా పక్కన పెట్టేశాడు నాగార్జున. మొత్తానికి బాలయ్య తీసిన ఎన్టీఆర్ బయోపిక్.. ఒకరకంగా నాగార్జునని భయపెట్టిందనే చెప్పాలి. ఏఎన్నార్ బయోపిక్ తీయనప్పటికీ ఆయన మనవళ్లు మాత్రం 'మహానటి', 'ఎన్టీఆర్ బయోపిక్' లలో ఏఎన్నార్ పాత్రలు పోషించారు.