దశాబ్దాల కాలంగా తెలుగు వెండితెరపై చిరంజీవి మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. అద్భుతమైన నటన, డాన్సులుతో తెలుగు ప్రేక్షకులని చిరు ఏళ్ల తరబడి అలరిస్తున్నారు. ఇక చిరంజీవి 80, 90 దశకాలలో నటించిన ప్రతి చిత్రం ఒక్కో ఆణిముత్యం. 

చిరంజీవి నటించిన చిత్రాలకి సీక్వెల్స్ చేయాలనే కోరిక అభిమానుల్లో చాల కాలంగా ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర సీక్వెల్ లో నటించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అదే విధంగా చంటబ్బాయ్ చిత్రంలో చిరంజీవి కామెడీ టైమింగ్ అద్భుతం. ఆ చిత్రానికి కూడా సీక్వెల్ రూపొందించాలనే ప్రతిపాదన ఉంది. 

సాయిధరమ్ తేజ్ కు కూడా మీడియా నుంచి  ప్రశ్నలు ఎదురయ్యాయి. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు వరుణ్ తేజ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అన్నయ్య నటించిన ఓ రెండు చిత్రాలని వరుణ్ తేజ్ సీక్వెల్ చేయాలనే కోరిక తనకు ఉందని నాగబాబు అన్నారు. 

అందులో ఒక చిత్రం ఛాలెంజ్ కాగా మరొకటి కొదమసింహం అని నాగబాబు అన్నారు. ఆ రెండు చిత్రాలు వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోతాయి. ఒక వేళ కుదిరితే వరుణ్ తేజ్ ఆ రెండు చిత్రాలకు సీక్వెల్స్ చేయాలనేది తన అభిప్రాయం అని నాగబాబు అన్నారు. 

వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.