సినీ తరాల వెడ్డింగ్ అంటే అభిమానుల్లో ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. పెళ్లీడు వచ్చినా బ్యాచిలర్స్ గానే ఉన్న హీరోలు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. ఈ ఏడాది నితిన్, నిఖిల్, రానా లాంటి హీరోలు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నారు. 

ఇదిలా ఉండగా మెగా బ్రదర్ నాగబాబుకు తన భాద్యతలు గుర్తుకు వస్తున్నాయి. వచ్చే ఏడాది తన పిల్లలు నిహారిక, వరుణ్ లకు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు నాగబాబు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వచ్చే ఏడాది నిహారికకు పెళ్లి చేయాలనుకుంటున్నట్లు నాగబాబు తెలిపారు. వచ్చే ఏడాది సమ్మర్ లోపు నిహారిక పెళ్లి జరుగుతుంది. ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నాం. 

యోగాసనాలతో హీట్ పెంచేసిన బోల్డ్ బ్యూటీ.. అవాక్కైపోతారు

ఆ తర్వాత కుదిరితే కొన్ని నెలల గ్యాప్ లోనే వరుణ్ పెళ్లి కూడా చేస్తా. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉంటే వారు ఎక్కడికి వెళుతున్నారు.. ఏం చేస్తున్నారు అనే టెన్షన్ ప్రతి తండ్రిగా ఉంటుంది. పెళ్లి చేసేస్తే నిహారిక సంగతి ఆమె భర్త.. వరుణ్ సంగతి అతడి భార్య చూసుకుంటారు అంటూ నాగబాబు సరదాగా వ్యాఖ్యానించారు. 

వారిద్దరికీ పెళ్లిళ్లు చేస్తే తానూ ఫ్రీ అయిపోతానని నాగబాబు అన్నారు. వరుణ్ ని ఐఏఎస్ చేయాలనేది.. నిహారికాని డాక్టర్ చేయాలనేది తన కోరిక అని.. కానీ ఆ రెండూ నెరవేరలేదని నాగబాబు అన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాల్లో  రాణిస్తున్నారు.