సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రతి అంశాలపై ఘాటుగా బదులిస్తూ హాట్ టాపిక్ గా మారిన నాగబాబు తనదైన శైలిలో కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. 

ఈ రోజు నా అభిమాన నటుల్లో ఒకరైన కృష్ణగారి పుట్టిన రోజు. ఈ సంధర్భంగా అఆయన గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. మెగాస్టార్ శకం ప్రారంభం కాకముందు టాలీవుడ్ ఎన్టీఆర్, ఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ నాలుగు స్తంభాలుగా ఉండేవారు. నా దృష్టిలో కృష్ణగారు ట్రెండ్ సెట్టర్. 

ఎవరూ సాహసం చేయని రోజుల్లో ఆయన టెక్నాలజీని బాగా ఉపయోగించారు. మొదటి 70 ఎంఎం, మొదటి డిటిఎస్, మొదటి ఈస్టమన్ కలర్ లాంటి ఎన్నో ప్రయోగాలు కృష్ణ చేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నాగబాబు తెలిపారు. 

నటన పరంగానే కాకుండా మీరు మంచి వ్యక్తి.. ఎందరికో సహాయం చేశారు అని నాగబాబు కృష్ణని ప్రశంసలతో ముంచెత్తారు.