'ఛలో' సినిమా తర్వాత సరైన హిట్ దొరకలేదు నాగశౌర్య కు. రీసెంట్ గా  సమంతతో కలిసి నటించిన ఓ బేబీ సినిమా సక్సెస్ సాధించినా కూడా అది నాగ శౌర్య ఖాతాలో పడలేదు. దాంతో ఎవరినో నమ్ముకుని దెబ్బ తినటం ఎందుకుని, తన సొంత ప్రొడక్షన్‌లో 'అశ్వథ్థామ' సినిమాతో మన ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు కథ కూడా తానే ఉందించాడు.

దాంతో నాగశౌర్యను ఇన్నాళ్లూ నటుడుగా,నిర్మాతగా చూసిన టాలీవుడ్ జనం..ఏ తరహా కథ ఇచ్చి ఉంటాడు..అని ఆసక్తిగా చర్చించటం మొదలెట్టాడు. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజై మంచి క్రేజ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమా కథని తెలుగులో వచ్చిన రెండు సినిమాలని మిక్స్ చేసి వడ్డిస్తున్నాడనే ప్రచారం మొదలైంది.

చీరకట్టుకుంటే.. జారుతుందే గుండె.. మైండ్ బ్లాక్ చేస్తోన్న రష్మిక!

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు..'అశ్వథ్థామ' సినిమా కథ...బెల్లంకొండ శ్రీను హీరోగా వచ్చిన రాక్షసుడు తరహా సైకో థ్రిల్లర్ గా ఉంటుంది. అలాగే అదే సమయంలో హీరోయిజం..అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాను గుర్తు చేస్తుందని అంటున్నారు. రాక్షసుడుకు సరైనోడు కలిపితే ఎలా ఉంటుందో అదే 'అశ్వథ్థామ' సినిమా అని చెప్తున్నారు. అలాగే ఈ సినిమా నేరేషన్ లో కార్తీ హీరోగా వచ్చిన ఖైధీ ఛాయిలు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే సినిమా రిలీజ్ అయితే కానీ ఇందులో ఎంత నిజం ఉందనేది చెప్పలేం.

విశాఖ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఇటీవల ఎక్కువగా జరుగుతున్న అమ్మాయిలపై అఘాయిత్యాలు అన్నది బేసిక్ పాయింట్.   ఈ సినిమా ఫుల్ లెంగ్త్ క్రైమ్ డ్రామా అని ,హీరో నాగశౌర్యని సైతం ఇంతవరకు ఏ దర్శకుడూ చూపని రీతిలో చాలా ఫెరోషియస్ గా చూపారని చెప్తున్నారు.  నాగ శౌర్య  రెండేళ్లు కష్టపడి మనసు పెట్టి ఈ కథను రాసానని చెప్తున్నారు.

ఈ చిత్రంలో నాగశౌర్య సరసన మెహ్రీన్ ప్రిజాద కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమాను నాగశౌర్య స్వయంగా తన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గిబ్రాన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్, శ్రీచరణ్ పాకాల పాటలు అందించారు. ఈనెల 31న విడదలవుతున్న ఈ సినిమాకు నిర్మాత ఉష మాల్పూరి.