టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య మరో డిఫరెంట్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ తరహాలో తెరకెక్కిన అశ్వద్ధామ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ యువ హీరో ఇటీవల ఒక స్ట్రాంగ్ లైన్ తో ఆడియెన్స్ ని ఆకర్షించాడు.

మాట నిలబెట్టుకోకపోతే చని పోయినట్టే అంటూ తన గత సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం గురించి వివరణ ఇచ్చారు. గతంలో తన సొంత ప్రొడక్షన్ లోనే నాగ శౌర్య నర్తనశాల అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఛలో సినిమాతో మంచి లాభాల్ని అందుకున్న నాగ శౌర్య ఆ సినిమాతో కాస్త దెబ్బ తిన్నాడు.

అయితే నర్తనశాల డిజాస్టర్ సినిమా అని ముందే ఊహించినట్లు నాగశౌర్య చెప్పాడు. కానీ అనుమానం ఉన్నప్పటికి దర్శకుడికి ఇచ్చిన మాటకోసం ఆ సినిమా చేయక తప్పలేదని.. ఎందుకంటె మాట నిలబెట్టుకోకపోతే చని పోయినట్టేనని నాగ శౌర్య వివరణ ఇచ్చారు. అంటే నాగశౌర్య తెలిసే రిస్క్ చేశాడన్నమాట. ఇకపోతే అశ్వద్ధామ విషయంలో మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు చెబుతూ.. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని చెబుతున్నాడు. మరి నాగశౌర్యకి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.