Asianet News TeluguAsianet News Telugu

ఛలో రేంజ్ లో నాగ శౌర్య 'అశ్వ‌థ్థామ‌'.. టార్గెట్ ఫిక్స్

ప్రస్తుతం విజయం కోసం కష్టపడుతున్న హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో నాగశౌర్య కూడా ఉన్నాడు. గత ఏడాది ఛలో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ శౌర్య ఆ తరువాత చేసిన సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి. ఇక మరోసారి హోమ్ బ్యానర్ లోనే డిఫరెంట్ మూవీని రూపొందిస్తున్నాడు.

naga shourya big hopes on his upcoming movie
Author
Hyderabad, First Published Dec 25, 2019, 8:29 PM IST

టాలీవుడ్ యువ హీరోల్లో ప్రస్తుతం విజయం కోసం కష్టపడుతున్న హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో నాగశౌర్య కూడా ఉన్నాడు. గత ఏడాది ఛలో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ శౌర్య ఆ తరువాత చేసిన సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి. ఇక మరోసారి హోమ్ బ్యానర్ లోనే డిఫరెంట్ మూవీని రూపొందిస్తున్నాడు.  

ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేయాలనీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు.

అందుకే సినిమా ప్రమోషన్స్ డోస్ కూడా పెంచబోతున్నారు. హీరో నాగ‌శౌర్య‌నే ఈ సినిమాకు క‌థ‌ను అందించడం విశేషం.  ఇక ఈ సినిమాను నాగ‌శౌర్య ఎంతో ప్రేమించి ప్యాష‌నేట్‌గా రూపొందిస్తున్నారు. అందుక‌నే ఈ సినిమా టైటిల్‌ను ఛాతీపై ప‌చ్చ‌బొట్టుగా వేయించుకున్నారు కూడా.

ప్ర‌స్తుతం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా టీజ‌ర్‌ను డిసెంబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస‌ర్ట్స్‌ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. మరి నాగ శౌర్య ఛలో రేంజ్ లో హిట్టందుకుంటాడో లేదో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios