రెండేళ్ల క్రితం ఛలో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ శౌర్య ఆ తరువాత చేసిన సినిమాలతో అనుకున్నంతగా సక్సెస్ ని అందుకోలేకపోయాడు. ఇక మరోసారి హోమ్ బ్యానర్ లోనే డిఫరెంట్ మూవీని రూపొందిస్తున్నాడు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`.  ఆ మధ్య హోమ్ బ్యానర్ లోనే నర్తనశాల సినిమాని నిర్మించిన నాగ శౌర్య ఊహించని విధంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇక ఛలో సినిమాతో వచ్చిన లాభాలని ఇప్పుడు అశ్వద్ధామపై పెట్టుబడిగా పెట్టాడు. ఇటీవల విడుదలైన టీజర్ కి పాజిటివ్ అయితే వచ్చింది. అలాగే భారీగా ఖర్చు చేసినట్లు అర్ధమవుతోంది. ఈ సినిమాతో నాగ శౌర్య తప్పనిసరిగా హిట్టు కొట్టి తీరాల్సిందే. ఓ విధంగా డేంజర్ జోన్ లో ఉన్నాడని టాక్ వస్తోంది. సో అశ్వద్ధామ పై అటు ఆర్థిక పరంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా అశ్వద్ధామ రీజల్ట్ కీలకంగా మారింది.

ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేయాలనీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. అందుకే సినిమా ప్రమోషన్స్ డోస్ కూడా పెంచబోతున్నారు. హీరో నాగ‌శౌర్య‌నే ఈ సినిమాకు క‌థ‌ను అందించడం విశేషం.   ఇక ఈ సినిమాను నాగ‌శౌర్య ఎంతో ప్రేమించి ప్యాష‌నేట్‌గా రూపొందిస్తున్నారు. అందుక‌నే ఈ సినిమా టైటిల్‌ను ఛాతీపై ప‌చ్చ‌బొట్టుగా వేయించుకున్నారు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. మరి నాగ శౌర్య ఛలో రేంజ్ లో హిట్టందుకుంటాడో లేదో చూడాలి.