'ఛలో' సినిమా తరువాత నాగశౌర్యకి మరో హిట్టు సినిమా పడలేదు. దీంతో తనే స్వయంగా ‘అశ్వథ్థామ’ అనే కథని సిద్ధం చేసుకున్నాడు. ఈ కథని నూతన దర్శకుడు రమణ తేజ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన నాగశౌర్య ఫస్ట్‌లుక్‌ మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. 

బ్లాక్ శారీలో అనసూయ.. హాట్ మెస్ అంటూ మైండ్ బ్లాక్

''ఎలా ఉంటాడో తెలియ‌ని ఓ రాక్ష‌సుడు.. వాడికి మాత్ర‌మే తెలిసిన ఓ ర‌హ‌స్యం.. సైర‌న్ కూత‌ల కింద ప‌నిచేసే వాడి సైన్యం.. గ‌మ్యం తెలియ‌ని ఒక యుద్ధం.. ఆ యుద్ధం గెల‌వాలంటే ఒక ఆర‌డుగుల నారాయ‌ణాస్త్రం కావాలి.. ఒక అశ్వ‌థ్థాముడు రావాలి'' అంటూ టీజర్ ఆరభంలో వినిపించిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

టీజర్ మొత్తాన్ని యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారు. ఈ సినిమాతో నాగశౌర్య మాస్ ఆడియన్స్ కి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. సినిమాలో శౌర్య సరసన మెహ్రీన్ హీరోయిన్ గా కనిపించనుంది.  

ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఉషా ముప్పలూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని జనవరి 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.