బిగ్ మల్టీస్టారర్ మూవీ వెంకిమామ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు ఖమ్మంలో గ్రాండ్ గా నిర్వహించారు. ట్రైలర్ ని కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఈవెంట్ లో నాగచైతన్య స్పెషల్ గా చేసిన కామెంట్స్ ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేశాయి.

నాగ చైతన్య మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉంది. అభిమానులను ఇలా కలుసుకోవడం. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. అభిమానులు ఇచ్చే సపోర్ట్ ని నేనెప్పుడూ మర్చిపోలేను. నా లైఫ్ లో నాకు రెండు సినిమాలు చాలా స్పెషల్ అని చెప్పాలి. మనం - వెంకిమామ  నాకు సినిమాలు కావు. ఒక మెమరీస్. కెమెరా ముందు కెమెరా వెనుక నన్ను స్పెషల్ గా చూసుకున్న మా మామతో గడిపిన క్షణాలను ఎప్పటికి మరచిపోలేను.

దర్శకుడు బాబీ కమర్షియల్ అండ్ గూడ కంటెంట్ ఎలిమెంట్స్ కలిపి చాలా కొత్తగా ట్రై చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు. నా కెరీర్ లో ఇలాంటి పాత్ర చేస్తానని అనుకోలేదు. సినిమాలో మిల్ట్రీకి సంబందించిన ఎపిసోడ్స్ అద్భుతంగా వచ్చాయి. వెంకిమామ - సురేష్ మామ చాలా హెల్ప్ చేశారు. రాశి ఖన్నా - పాయల్ రాజ్ పుత్ కూడా సినిమాలో మంచి పాత్రల్లో నటించారు.

థమన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మరో బూస్ట్ ఇచ్చింది. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుంది. మామ అల్లరి సినిమాలో మాములుగా ఉండదు. మీ అంచనాలకు తప్పకుండా చిత్రం చేరుతుందని ఇంతవరకు వచ్చిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలని నాగ చైతన్య మాట్లాడారు.

--

also read: వెంకీ మామ ట్రైలర్.. మామ అల్లుళ్ళ మోత మాములుగా లేదు 

దగ్గుబాటి వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వెంకీ మామ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చి పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది. ఇక నేడు గ్రాండ్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.

 ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండగా ఇప్పుడు వెంకిమామ ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇక సినిమా లో మామ అల్లుళ్ళు మోత మోగించారని అనిపిస్తోంది. డైలాగ్స్ ఎమోషన్స్ అండ్ కామెడీ ఇలా అన్ని నవసరసాలు సినిమాలో ఉన్నట్లు అర్ధమవుతోంది. దర్శకుడు బాబీ చైతు - వెంకీ ల మధ్య క్రియేట్ చేసిన సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా కనెక్ట్ కానున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

మరోవైపు పాయల్ రాజ్ పుత్ - రాశి ఖన్నా గ్లామర్ కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ కా నిలవనుంది. మొత్తానికి ట్రైలర్ తో ఆకట్టుకున్న మామ అల్లుళ్ళు బిగ్ స్క్రీన్ పై ఏ లెవెల్లో మోత మోగిస్తారో తెలియాలంటే డిసెంబర్ 13వరకు వెయిట్ చేయాల్సిందే. సురేష్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు తమన్స్ మ్యూజిక్ అందించాడు.