అక్కినేని యువ హీరో నాగ చైతన్య తండ్రి, తమ్ముడు కంటే కూడా స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. మజిలీ సినిమాతో చాలా కాలం తరువాత బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న నాగ చైతన్య నెక్స్ట్ వెంకీ మామ సినిమాతో ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు.

ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గీతగోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహించబోయే నెక్స్ట్ సినిమాలో చైతూ కథానాయకుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం.

గీతగోవిందం హిట్టయిన తరువాత కొంతమంది స్టార్ హీరోలను కలిసిన పరశురామ్ ఎవరితోను ఒకే చేయించుకోలేకపోయాడు. ఇక ఎలాగైనా ఇప్పుడు చైతుతో ఒక సినిమాను తెరేక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఇక నాగ చైతన్య అజయ్ భూపతితో కూడా వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు గతంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

ఇక ఇప్పుడు మళ్ళీ పరశురామ్ అని అంటున్నారు. మొత్తానికి నాగ చైతన్య ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన దగ్గరకు వస్తున్న దర్శకులకు డేట్స్ లేవలేని తప్పించుకోవడం లేదు. ముందు కథ విని విని ఆ తరువాత చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. కథ నచ్చితే ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమాను చేయడానికి ఒపుకుంటున్నట్లు తెలుస్తోంది.