అక్కినేని హీరోల్లో నాగ చైతన్య ఒక్కడే వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తనకు సెట్టయ్యే కథలను ఎందుకంటూ ఆడియెన్స్ ని డిఫరెంట్ గా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే గత ఏడాది చివరలో వచ్చిన వెంకీ మామ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే కెరీర్ ఎలా ఉన్నా కూడా చైతు రెమ్యునరేషన్ డోస్ మాత్రం తగ్గడం లేదు.

శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చైతు కమర్షియల్ హీరో అనిపించుకుని తనకంటూ ఒక మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు. మజిలీ సినిమా కూడా బాక్సా ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంది. వెంకిమామ కూడా ఓపెనింగ్స్ ని గట్టిగానే ఉంది. దీంతో తన రెమ్యునరేషన్ ని చైతు 8కోట్లకు పెంచినట్టు తెలుస్తోంది. ఓ విధంగా నాగార్జున కంటే ఇది పెద్ద నెంబర్ అని చెప్పవచ్చు.  నాగ్ సినిమా బడ్జెట్ ని బట్టి 7కోట్లకు మించడు.

కానీ చైతు అంతకంటే ఎక్కువ లాగుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం చైతు ఈ రేంజ్ లో డిమాండ్ చేశాడట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న ఈ అక్కినేని లవర్ బాయ్ ఆ తరువాత పరశురామ్ సినిమాతో రాబోతున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లో ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని రూపొందించనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.