నాగ చైతన్య గత ఏడాది నటించిన మజిలీ, వెంకీ మామ చిత్రాలు మంచి విజయం సాధించాయి. నాగ చైతన్యకు ప్రేమ కథా చిత్రాల్లో మంచి రికార్డ్ ఉంది. చైతు తాజాగా క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శత్వంలో లవ్ స్టోరీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. తాజాగా లవ్ స్టోరీ చిత్రం నుంచి ఏయ్ పిల్ల అనే రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు. 

సీహెచ్ పవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పవన్ ఏయ్ పిల్ల సాంగ్ ని వినసొంపైన విధంగా కంపోజ్ చేశాడు. హరిచరణ్ పాడిన ఈ పాటకు పింగళి చైతన్య సాహిత్యం అందించారు. 

ఫిదా లాంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శత్వంలో తెరక్కుతున్న చిత్రం ఇదే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్, పుష్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.