‘దూత’వెబ్ సీరిస్ కు షాకింగ్ బడ్జెట్,నెట్ ప్లిక్స్ కు చెక్ పెట్టడానికే?
నాగచైతన్య డిజిటల్ డెబ్యూ దూత వెబ్ సిరీస్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదల ఆలస్యం చేసుకుంటూ వచ్చిన అమెజాన్ ప్రైమ్ ఎట్టకేలకు...

వెబ్ సీరిస్ బడ్జెట్ అంటే కొన్ని లెక్కలు ఉంటాయి. సినిమా తీసినట్లు ఎంత పెడితే అంత పెట్టేయరు. కానీ ఎప్పుడైతే స్టార్ వచ్చారో అప్పుడే లెక్కలు మారిపోతాయి. అలాగే చైతూ తొలి వెబ్ సీరిస్ దూత రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ నేపధ్యంలో ఈ సీరిస్ కు పెట్టిన బడ్జెట్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే...
నాగచైతన్య (Naga Chaitanya) ఓటీటీలో అరంగేట్రం చేస్తున్న వెబ్ సీరిస్ దూత. అమెజాన్ ప్రైమ్ వీడియో మొట్టమొదటి తెలుగు సిరీస్ గా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో ‘దూత’ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మొత్తం 8 ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్ రానుంది. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుందని తెలుస్తోంది.
ఈ వెబ్ సిరీస్‌ను ప్రైమ్ వీడియోతో కలిసి శరద్ మరార్ నిర్మించారు. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో ఈ సిరీస్‌ను నిర్మించారని తెలుస్తోంది. ఓ తెలుగు వెబ్ సీరిస్ పై అంత బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. అయితే నాగచైతన్య హీరోగా చేస్తూండటంతో వెబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. అందుకే అమేజాన్ అంత బడ్జెట్ పెట్టి నెట్ ప్లిక్స్ కు సవాల్ విసరబోతోందని చెప్తున్నారు. నెట్ ప్లిక్స్ లో లోకల్ కంటెంట్ లేకపోవటం మైనస్ గా భావిస్తున్నారు. అమేజాన్ ఆ లోటుని ఇలా హీరోలతో సీరిస్ తీసి తీర్చబోతోంది. ఈ సిరీస్‌లో పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచి దేశాయి, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సిరీస్‌ను రూపొందించినట్టు సమాచారం.
సినిమాల విషయానికి వస్తే...నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలరి పాత్రను నాగచైతన్య పోషిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.