నాగ చైతన్య, పరశురాం కాంబినేషన్ లో  ఆ మధ్యన ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్రాజెక్టు జరుగుతుందా లేదా అనే సందేహం మొదలైంది. ఎందుకంటే తనతో చేయటానికి మహేష్ ...పరశురాంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో నాగ చైతన్య ప్రాజెక్టు వదిలేసి మహేష్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ గా పరశురాం ఇంకా నాగచైతన్యకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదట. అయితే ఇప్పుడు పరశురాం వెళ్ళిపోయినంత మాత్రాన నాగ చైతన్యకు వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆయన వరస ప్రాజెక్టులను లైన్ లో పెట్టి ఉన్నారు.

పరశురాం ఏ క్షణమైనా ప్రక్కకు తప్పుకునేటట్లు ఉన్నాడని తన నెక్ట్స్ ప్రాజెక్టుని లైన్ లో పెట్టేశాడట చైతు. ఇప్పటికే మహిళా దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ విని ఓకే చెప్పిన చైతన్య.. స్క్రిప్టు పూర్తి చేసుకుని షూట్ కు రెడీ అవ్వమని చెప్పారట. స్వప్నాదత్, ప్రయాదత్ ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా ప్రకటించాలంటే పరశురాం.. నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. అందుకోసం చైతు, నిర్మాతలు వెయిట్ చేస్తున్నారట. మరో ప్రక్కన నందిని రెడ్డి స్పీడుగా స్క్రిప్టు పనిలో పడిపోయింది.
 
ప్రస్తుతం నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.  ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ తో రూపొందుతున్న  ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. కానీ గత రెండు రోజులుగా సినిమా వాయదాపడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని, చిత్రాన్ని ముందుగా అనుకున్న తేదీకే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. లాంచింగ్ రోజు నుండే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ మొదలైంది. దాన్ని రీసెంట్ గా  ఇటీవల విడుదలైన ‘ఏ పిల్లా’ మ్యూజికల్ ప్రివ్యూ రెట్టింపు చేసింది. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. తమ కలల్ని నిజం చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన యువతీయువకుల కథగా ఈ చిత్రం ఉండనుందని చెప్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.