టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత పుట్టిన రోజు నేడు. లాక్ డౌన్‌ కారణంగా సమంత కూడా తన పుట్టిన రోజును చాలా సాధాసీదాగా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటుంది. అయితే ఈ బ్యూటీ కోసం అక్కినేని యువ సామ్రాట్, ఆమె భర్త సమంత ఏం చేశాడో తెలుసా..? తన ముద్దుల భార్య కోసం తానే సవ్యంగా కేక్ తయారు చేసి సెలబ్రేట్ చేశాడు చైతూ. లాక్ డౌన్‌ కారణంగా బయట కేక్‌లు దొరికే పరిస్థితి లేదు. దీంతో సెలబ్రిటీలు తమ బర్త్‌  డేల కోసం ఇంట్లోనే కేకులు తయారు చేసుకుంటున్నారు.

ఇటీవల అల్లు అర్జున్‌ ఫ్యామిలీలో జరిగిన పలు పుట్టిన రోజు వేడుకలు ఇలాగే జరిగాయి. తాజాగా సమంత బర్త్ డే వేడుకలను కూడా చైతూ స్వయంగా సెలబ్రేట్ చేయటం విశేషం. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే సినిమాలో చైతూ, సామ్‌లు కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే ప్రేమలో పడ్డా వీరు. పెద్ద అంగీకారంతో  పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తరువాత కూడా సమంత హీరోయిన్‌గా కొనసాగుతోంది. అయితే గతంలోలా గ్లామర్ రోల్స్‌ కాకుండా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది సామ్‌. ఇటీవల జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్‌, తమిళ్‌లో విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కతువాకుల రెండు కాదల్‌ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. లాక్ డౌన్‌ తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Family ❤️ .... (no points for guessing what I am praying for )

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Apr 27, 2020 at 12:29pm PDT