విక్టరీ వెంకటేష్, చైతు కలసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ వెంకీమామపై మంచిబజ్ నెలకొని ఉంది. ఈ రియల్ లైఫ్ మామ అల్లుళ్లు వెండితెరపై ఎలాంటి సందడి చేస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 

తాజాగా ఈ చిత్రంలోని వెంకీమామ అంటూ సాగే టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అల్లుడిగా నటిస్తున్న చైతు.. మామ వెంకీపై తనకున్న ప్రేమని చాటి చెప్పేలా ఈ పాట ఉంది. సంగీత దర్శకుడు తమన్ ఈ పాటని చక్కగా కంపోజ్ చేశాడు. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ గా సాగే లిరిక్స్ అందించాడు. 

లిరికల్ వీడియోలో వెంకటేష్, చైతు మధ్య సరదాగా సాగే సన్నివేశాలు, చిత్ర చిత్రీకరణని చూపించారు. ఈ పాటని శ్రీ కృష్ణ అందంగా పాడాడు. జైలవకుశ చిత్రంతో మెప్పించిన డైరెక్టర్ బాబీ ఈ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాడు. 

లేటెస్ట్ సెన్సేషన్ పాయల్ రాజ్ పుత్ వెంకటేష్ కు హీరోయిన్ గా నటిస్తోంది. క్రేజీ బ్యూటీ రాశి ఖన్నా నాగ చైతన్య సరసన నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.