ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు తెరమీద ఆడిపాడి.. అలరిస్తే చూడాలని జనం కోరుకుంటారని నమ్మి చేసిన సినిమా ‘వెంకీమామ‌’ . విక్టరీ వెంకటేశ్‌, యువసామ్రాట్‌ నాగచైతన్య. ఈ ఇద్దరూ రియల్‌లైఫ్‌లో మామ-అల్లుడు. రీల్‌లైఫ్‌లోనూ అవే పాత్రలు వేస్తూ.. తెరమీదకు వస్తున్నారంటే సహజంగానే ఈ మల్టీస్టారర్‌ సినిమాపై మంచి క్రేజ్‌ ఏర్పడింది. అందుకు తగ్గట్లే ఓపెనింగ్స్ , వీకెండ్ కలెక్షన్స్ ఉన్నాయి.

దానికి తగినట్లుగా... ‘గురు’, ఎఫ్‌-2 సినిమాలతో మంచి జోష్‌లో వెంకీ, ‘మజిలీ’ సూపర్‌హిట్‌ అందుకున్న చైతూ.. కలిసి నటించిన సినిమా ‘వెంకీ మామ’ ట్రేడ్ కు ప్లస్ అయ్యింది. ఈ మామ అల్లుళ్లు తెరమీద చేసిన హంగామా జనాలకు బాగానే నచ్చుతోంది. నిర్మాతలు హ్యాపీ. అయితే అదే సమయంలో నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ఎక్కడా కనపడకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

2019లో 100కోట్ల సినిమాలు.. నెగిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైంది!

సినిమా ప్రారంభం నుంచి, ప్రీ రిలీజ్ ఫంక్షన్, రిలీజ్, ఎక్కడా నాగ్ ఊసులేదు. ఏ పోగ్రామ్ లోనూ నాగ్, అఖిల్, సమంత పాల్గొనలేదు. అక్కినేని హీరో సినిమా కావటంతో నాగ్ ఖచ్చితంగా వస్తారని ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. చిత్రంగా  అఖిల్, సమంత కూడా పట్టించుకోలేదు.వేరే వాళ్లకు విషెష్ చెప్పే రీతిలో కూడా ట్వీట్స్ చేయలేదు.

ఎందుకు ఈ సినిమా విషయంలో నాగార్జున సైలెంట్ గా ఉన్నారనే విషయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. చైతు హిట్ ని ఎక్కువ ఎంజాయ్ చేసేది ఆయనే. అలాంటిది ఆయన సైలెంట్ అవటం ఆశ్చర్యమే అంటున్నారు. మరో ప్రక్క చైతు భార్య, అక్కినేని కోడలు సమంత కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ఎక్కడా చిన్న మాట కూడా మాట్లాడకపోవటం కూడా డిస్కషన్ గా మారింది.

ఈ నేపధ్యంలో నాగార్జున ఎందుకు అలా అంటీ ముట్టనట్లుగా ఉన్నారనే విషయమై మీడియాలో,ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న విషయం ఏమిటీ అంటే ...చైతుకు ఈ సినిమాలో అన్యాయం జరిగిందని నాగ్ భావిస్తున్నారట. ఇది పూర్తిగా వెంకటేష్ సినిమా గా మారిందని, చైతుకు పెద్ద క్యారక్టర్ ఏమీ లేదని, ఆయన్ని బాధించిందట. సురేష్ బాబు దగ్గరుండి ఇలా చేయించకపోవచ్చు కానీ స్క్రిప్టు ముందే తెలిసినప్పుడు చైతు కు కూడా సమన్యాయం చేయాలి కదా అని సమంత భావించిట. ఇందులో నిజం ఎంత ఉందో కానీ ఇదే విషయం మీడియాలో ప్రచారం అవుతోంది. మరి దీన్ని ఖండించటానికైనా నాగ్ వచ్చి ఈ సినిమా గురించి నాలుగు ముక్కలు మాట్లాడితే అందరూ సైలెంట్ అవుతారు. లేకపోతే ఈ సైలెన్స్ మరిన్ని సైలెన్స్ లకు సైలెంట్ గా దారి తీస్తుంది.