మహానటి దర్శకుడు నాగ అశ్విన్ ఓ ట్రైలర్ విడుదల చేసారంటే ఖచ్చితంగా అందులో ఏదో విషయం ఉండే ఉంటుందని అందరూ భావిస్తారు. సున్నితమైన భావోద్వేగాలు తన సినిమాలో చూపే ఆయన తాజాగా ఓ కొత్త చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ సినిమా  శైలేష్‌ సన్ని, జ్ఞానేశ్వరి జంటగా దర్శకుడు అశోక్‌ రెడ్డి రూపొందించిన మిస్టర్‌ అండ్‌ మిసెస్‌. రీడింగ్‌ ల్యాంప్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మాణంలో క్రౌడ్‌ ఫండెడ్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల ప్రేరణతో, అడల్ట్ కంటెంట్‌తో ఈ  సినిమాలు తెరకెక్కిందనిపిస్తోంది. కొద్దిగా అడల్ట్ కంటెంట్ ని మిక్స్ చేస్తూ ఈ ట్రైలర్ సాగింది.

ప్రస్తుతం యూత్ కి సెల్ఫీ వీడియోలు తీసుకోవడం, ప్రతి మూవ్‌మెంట్‌ని కాప్చర్‌ చేయటం అలవాటైపోయింది. మరి ఈ అలవాటు ఇద్దరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పిందనేది తెలియాలంటే 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌' సినిమా చూడాల్సిందే' అని అంటున్నారు దర్శకుడు అశోక్‌రెడ్డి.  ఈ ట్రైలర్ లో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ  తాము మొదటి సారి కలిసిన దాన్ని వీడియోగా తీస్తారు. కానీ ఆ వీడియో బయిటకు వెళ్లిపోతుంది. అక్కడ నుంచి ఆ ఇద్దరు లవర్స్ మధ్య విభేధాలు వస్తాయి. మరో ప్రక్క ఆ వీడియోని ఆపాలి. ఈ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందిందని అర్దమవుతోంది. మీరూ ఓ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.
 
జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్నీ జంటగా కనిపించనున్నారు. మిస్టర్ అండ్ మిస్.. క్రౌడ్ ఫండింగ్ సినిమాగా రూపొందుతోంది. అశోక్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ, లిరిక్స్ : పవన్ రాచేపల్లి, మ్యూజిక్ : యశ్వంత్ నాగ్, సినిమాటోగ్రఫీ : సిద్ధం మంధార్, ఎడిటింగ్ : కార్తీక్ కట్స్, ఆర్ట్ : కరిష్ కుమార్, కథ, డైరెక్షన్ : అశోక్ రెడ్డి, బ్యానర్ : రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్.