ఇస్మార్ట్ శంకర్ చిత్ర విజయంతో యంగ్ బ్యూటీ నభా నటేష్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇస్మార్ట్ శంకర్ మూవీలో నభనటేష్ గ్లామర్ తో కుర్రకారుని ఆకర్షించింది. టాలీవుడ్ కమర్షియల్ చిత్రాలకు సరిపోయే హీరోయిన్ అంటూ ప్రశంసలు దక్కాయి. 

ప్రస్తుతం నభా నటేష్ రవితేజ సరసన డిస్కోరాజా చిత్రంలో, బెల్లకొండ శ్రీనివాస్ సరసన మరో చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ యంగ్ హీరోయిన్ కు క్రేజీ ఆఫర్ దక్కినట్లు టాక్. 

యంగ్ హీరో నిఖిల్ త్వరలో కార్తికేయ సీక్వెల్ లో నటించబోతున్నాడు. చందు ముండేటి దర్శత్వంలో తెరకెక్కిన కార్తికేయ చిత్రం మంచి విజయం సాధించింది. దీనితో దర్శకుడు చందు ముండేటి సీక్వెల్ కు ప్లాన్ చేయడం, నిఖిల్ ఓకే చేయడం జరిగింది. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా నభా నటేష్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చందు పూర్తి స్క్రిప్ట్ ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.