వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో వెలుగుతున్న  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ . ఈ సంస్ద కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. కంటెంట్ డ్రైవన్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ చిత్రం అందరూ కొత్త వాళ్లతో రూపొందనుంది.  రితేష్‌ రానా అనే కొత్త దర్శకుణ్ని పరిచేస్తూ ‘మత్తు వదలరా’ అనే సినిమాను నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్‌ విడుదలైంది.

చాలా ఇంట్రస్టింగ్  రూపొందించారు ఈ పోస్టర్‌ను. ఇందులో అలనాటి అగ్ర నటుడు ఎన్టీఆర్, మరోవైపు టీవీలో  మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారు. అలారంపై ‘మత్తు వదలరా’ అని చిత్ర టైటిల్‌ని రూపొందించారు. ఫ్లాట్‌ నంబరు 401, కస్టమర్‌ ఈజ్‌ గాడ్‌.. గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌ అనే సూక్తితో పోస్టర్‌ను ఇంట్రస్టింగ్ గా ఉంది.    కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్, నటినటులను త్వరలోనే ప్రకటించనున్నారు.

సినిమా న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా  ఉండబోతుందని తెలుస్తోంది. యూత్ ఎదుర్కొంటున్న ఓ చిత్రమైన సమస్యను  సినిమాలో ప్రస్తావించనున్నట్లు చెప్తున్నారు. యూత్ టార్గెట్ సాగే ఈ సినిమా క్లిక్ అయితే మరిన్ని కంటెంట్ బేసెడ్ సినిమాలు చేయాలని ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.  

దాంతో  కొత్త తరహా కథాంశాలతో విల‌క్ష‌ణ‌మైన సినిమాలు నిర్మించడానికి కొన్ని కథలు ఎంపిక చేసి , ఈ సినిమా మొదట ట్రైల్ క్రింద వదులుతున్నట్లు వినికిడి. న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ ఈ సినిమాపై మంచి నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నటించే నటీనటులు గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.