శ్రీమంతుడు, రంగస్థలం సినిమాలతో టాలీవుడ్ ప్రొడక్షన్ లోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఆ తరువాత హ్యాట్రిక్ విజయాలతో బ్యానర్ క్రేజ్ ని మరీంత పెంచుకుంది. నిర్మాతలు నవీన్ - రవిశంకర్ కొద్దీ కాలంలోనే మంచి నిర్మాతలుగా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మైత్రి మార్క్ ని  ఇంకాస్త పెంచాలని ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో బిగ్ బడ్జెట్ మూవీని తెరకెక్కించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పటికే సల్మాన్ టీమ్ ని సంప్రదించిన నిర్మాతలు సల్మాన్ దగ్గరి బంధువైన నిర్మాత అతుల్ అగ్నిహోత్రిని కూడా కలిశారు. అతుల్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా బాలీవుడ్ సినిమాను పట్టాలెక్కించాలని మైత్రి నిర్మాతలు అడుగులు వేస్తున్నారు.మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా ఏ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూ హిందీ సినిమాలను డబ్ చేస్తున్నాడు.

దబాంగ్ సినిమా తెలుగులో రిలీజైన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు నిర్మాతలు ద్విభాషా చిత్రానికి తగ్గట్టుగా ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఎంచుకుంటే సల్మాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక జనతా గ్యారేజ్ - రంగస్థలం వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం మైత్రి మూవీ మేకర్స్ పెద్ద హిట్స్ అందుకోలేకపోయింది. అమర్ అక్బర్ ఆంటోని - డియర్ కామ్రేడి - గ్యాంగ్ లీడర్ సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. ఇక నెక్స్ట్ వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' - అల్లు అర్జున్ 20వ సినిమాలతో రానుంది. అలాగే పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాను కూడా ఇదే బ్యానర్ లో రూపొందనుంది.