Asianet News TeluguAsianet News Telugu

చక్రి భార్యకు రెండో పెళ్లి.. ఇప్పుడెక్కడుంది? షాకింగ్ విషయాలు వెల్లడించిన మహిత్ నారాయణ్

టాలీవుడ్ సంగీత దర్శఖుడు, దివంగత చక్రి కన్నుమూసి ఎనిమిదేండ్లు గడిచింది. అయితే ఆయన భార్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చక్రి కుటుంబ సభ్యులతో ఏమైనా సంబధాలు ఉన్నాయా? అనే విషయాలను ఆయన తమ్ముడు వెల్లడించారు.
 

Music Director Chakri brother Mahit Narayan Comments NSK
Author
First Published Mar 31, 2023, 3:48 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు, దివంగత చక్రి (Chakri) మహబూబాబాద్ జిల్లాలోని కాంబాలపల్లిలో 1974లో జన్మించారు. విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేసుకున్నారు. సంగీతంపై ఆసక్తితో సినిమాల్లో అడుగుపెట్టారు. 2004లో చక్రి - శ్రావణిని పెళ్లి చేసుకున్నారు. తను చనిపోయే వరకు భ్యారతోనే కలిసి ఉన్నారు. ఆయన మరణానంతరం కొన్ని ఆస్తి గొడవలు వినిపించాయి. అయితే తాజాగా వీటిపై చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ (Mahit Narayan) స్పందించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని వివరాలను వెల్లడించారు. 

మహిత్ మాట్లాడుతూ.. ‘అన్నయ్య చక్రి ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందుదలు లేవు. ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు పుట్టుకొచ్చాయి. అన్నయ్య లేడనే బాధకు తోడు ఈ ఘర్షణలు మొదలయ్యాయి. ప్రతి రోజు నరకంగా అనిపించేది. ఆ తర్వాత సద్దుమణిగాయి. అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని ఆయన భార్య అమ్మేసి అమెరికాకు వెళ్లింది. అక్కడే మరో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ప్రస్తుతం మాకు ఆమెతో ఎలాంటి సంబంధాల్లేవు. కొన్ని ఆస్తులకు సంబంధించిన కేసులు ఇంకా కోర్టులోనే ఉన్నాయి. ‘ అని మహిత్ పేర్కొన్నారు. 

రీసెంట్ గా చక్రి కుటుంబం మరీ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. వాటిపైనా గతంలోనే క్లారిటీ ఇచ్చారు మహిత్. తమ ఫ్యామిలీ రోడ్డున పడేంత ఆర్థిక ఇబ్బందులేమీ లేవన్నారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలని తెలిపారు. కేవలం ఆయనకు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అవకాశాలు లేవని చెప్పారు. ఇక మహిత్ కు చిన్న చిన్న సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఆఫర్లు వస్తున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పరారి’ చిత్రానికి మహితే  సంగీతం అందించారు.

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, దివంగత చక్రి (Chakri)  తన సంగీతంతో తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను అందించి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును పొందారు. దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలకు చక్రినే సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇండియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, సత్యం, దేశముదురు, దేవదాస్, నేనింతే, సింహ వంటి చిత్రాలు హిట్ ఆల్బమ్స్ ను అందించారు. మొత్తం 85 సినిమాలకు వర్క్ చేశారు. అలాగే కన్నడ, తమిళం, మలయాళంలో కొన్ని పాటలకు గాత్రం కూడా అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios