Asianet News TeluguAsianet News Telugu

ఎమ్ ఎస్ రాజు కు సెన్సార్ ట్రబుల్ తప్పదా?

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నిర్మాత ఎమ్ ఎస్ రాజు...సైలెంట్‌గా `డర్టీ హరి` అనే సినిమా తీశారు. బోల్డ్ అటెంప్ట్ ఇది అని ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ని బట్టి అర్దమవుతోంది. 

MS Raju's Dirty Hari to have censor trouble
Author
Hyderabad, First Published Feb 5, 2020, 9:32 PM IST

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నిర్మాత ఎమ్ ఎస్ రాజు...సైలెంట్‌గా `డర్టీ హరి` అనే సినిమా తీశారు. బోల్డ్ అటెంప్ట్ ఇది అని ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ని బట్టి అర్దమవుతోంది. బయిట అడల్ట్ ట్రెండ్‌ నడుస్తోందని, దానికి  త‌గ్గ‌ట్టుగా తీయాల‌నుకున్నారో  పోస్ట‌ర్లు ఘాటుగా వదిలారు. బాత్ టబ్ లో అబ్బాయి నోట్లో ...ఓ అమ్మాయి కాలితో సిగరెట్ పెడుతున్న ఆ పోస్టర్ ఉంది. తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నారని అందరకీ దాంతో అర్దమైంది.

సస్పెన్స్ తో సాగే అడల్ట్ కామెడీ ఈ చిత్రం అని బయిట ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. ఈ సినిమాలో సాలిడ్ గా హాట్ సీన్స్ ఉన్నాయని అంటున్నారు. ఎమ్ ఎస్ రాజు నుంచి అసలు ఊహించని స్టఫ్ ఇది. స్కిన్ షో మీద, అడల్ట్ సీన్స్ మీద కనుక ఆధారపడితే ఖచ్చితంగా సెన్సార్ వద్ద సమస్య వస్తుంది. అలాంటి సీన్స్ ని సెన్సార్ ఎంతవరకూ ఓకే చేసి,సర్టిఫికేట్ ఇస్తుందని డౌటే. అయితే ఎన్నో సినిమాలు తీసి, సెన్సార్ తో అనుబంధం ఉన్న ఎమ్ ఎస్ రాజు కు ఈ విషయం తెలియందీ కాదు. సినిమాకు ఎ సర్టిఫికేట్ ఇచ్చి వదిలేస్తారో లేక సీన్స్ కట్ చేస్తామంటారో అన్నది నిజమైన సస్పెన్స్.
 
ఈ సినిమా గురించి ఎం. ఎస్. రాజు చెప్తూ-”బాలచందర్, పుట్టన్న కనగల్, భరతన్ వంటి దర్శకులు చేసిన కొన్ని ప్రయత్నాలు అప్పట్లో చాలా బోల్డ్ గా ఉన్నా బ్యూటిఫుల్ గా, క్లాసికల్ గా ఉండేవి. అలాంటి వారి స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని నేను కూడా చాలా బోల్డ్ గాను, పొయెటిక్ గాను మలిచాను. ఇది ఆడియన్స్ కి నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు. కానీ బయిట పరిస్దితులు అలా లేవు. ఆ రోజులు కూడా కావు ఇవి. బోల్డ్ అంటెంప్ట్ అనే పేరుతోనే వ‌చ్చినా బూతు ముద్ర‌ని వేసేస్తున్నారు.చూడాలి ఈ సినిమా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌ ఉంటుందేమో.

ఈ చిత్రానికి ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్నారు. ఈ చిత్రం అందంగా మరియు పొయిటిక్ గా యువ ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుంద‌ని ఎంఎస్ రాజు వెల్లడించారు. గూడూరి శివ‌రామకృష్ణ‌, గూడురు స‌తీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్‌పీజే క్రియేష‌న్స్ బేన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Follow Us:
Download App:
  • android
  • ios