Asianet News TeluguAsianet News Telugu

ఈవారం విడుదలయ్యే సినిమాల లిస్ట్!

 కరోనా ఫస్ట్‌వేవ్‌ ముగిశాక ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి మొదలైందనుకునేలోగా సెకండ్‌ వేవ్‌ ప్రత్యక్షమైంది. థియేటర్లని మళ్లీ మూసేసింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడటంతో థియేటర్లు తెరచుకోనున్నాయి.  

Movies and web series coming up this week jsp
Author
Hyderabad, First Published Jul 26, 2021, 3:58 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

యావత్ ప్రపంచాన్ని రెండు సంవత్సరాలు గా వణికిస్తుంది కరోనా వైరస్. ప్రపంచ వ్యాప్తంగా లాక్‏డౌన్ విధించి అటు ఆర్థికంగా నష్టపోయేలా చేసింది. అటు ఈ మహామ్మారి సిని ఇండస్ట్రీని కూడా వదలకుండా, పలువురు ప్రముఖులకు సోకింది. ఇటీవల కాలంలో దేశంలో కొవిడ్ కోసులు కాస్తా తగ్గుముఖం పట్టాయి. కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ కాస్తా ఊపిరి తీసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు వహిస్తూ మళ్ళీ సాధరణ జీవనం గడపడానికి ప్రయాత్నిస్తున్నారు. 

ఇక సినీ ఇండస్ట్రీలో కూడా సంవత్సర కాలంగా సినిమా షూటింగ్‏లు నిలిచిపోయాయి. అటు థియేటర్లు కూడా మూతపడిపోయాయి. తాజాగా సినిమా షూటింగ్‏లు ప్రారంభమవడంతో అటు నెమ్మదిగా సినిమా థియేటర్లు కూడా మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు నిర్వహకులు. కానీ సినిమా రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ థియేటర్లలోకి జనాలు వస్తారా? రారా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే తెలంగాణలో థియేటర్ల పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే సినిమాలూ విడుదలకు సై అంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేసేందుకు  సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

ఇష్క్‌ 

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ… మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటిస్తున్న చిత్రం ఇష్క్ (not a love story). ఈ సినిమాతో నూతన దర్శకుడిగా ఎస్ఎస్ రాజు పరిచయం కాబోతున్నాడు. ఆర్ బీ చౌదరి సమర్పణలో ఎన్వీప్రసాద, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించి ఆకట్టుకున్న తేజ జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా మారి అందరినీ మెప్పించాడు. ఇప్పుడు ఇష్క్ సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు
 
  సత్యదేవ్‌

యంగ్ టాలెంట్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న “తిమ్మరుసు” సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూలై 30న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ అనంతరం సినిమా హాళ్ళలో రిలీజ్ అయ్యే మొదటి తెలుగు సినిమా “తిమ్మరుసు” కానుంది. కాగా ఇందులో సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ ఎస్‌.కోనేరు నిర్మించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు.


ఇక ఓటీటీలో వచ్చే చిత్రాలివే!


* మలయాళ స్టార్‌ హీరోగా నటించిన ‘వన్‌’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. జులై 30న ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది.

* లవ్‌ ఇన్‌ ది టైమ్స్‌ ఆఫ్‌ కరోనా - షార్ట్‌ఫిల్మ్‌(ఇంగ్లిష్‌) - వూట్‌‌, జులై 27

* ఛత్రసల్ - వెబ్ సిరీస్(హిందీ) - ఎంఎక్స్‌ ప్లేయర్‌, జులై 29

* లైన్స్ - సినిమా(హిందీ) - వూట్‌‌, జులై 29

* సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ 2 - వెబ్‌ సిరీస్‌(హిందీ) - వూట్‌‌, జులై 30

* మిమి - సినిమా(హిందీ) -  నెట్‌ఫ్లిక్స్‌, జులై 30

* సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ - వెబ్‌సిరీస్‌(ఇంగ్లిష్‌) - హాట్‌స్టార్‌, జులై 30

* లిహాఫ్ - షార్ట్‌ఫిల్మ్‌(హిందీ) -  నెట్‌ఫ్లిక్స్‌‌‌, జులై 31 

Follow Us:
Download App:
  • android
  • ios