హైదరాబాద్: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాదులోని మధురానగర్ లో గల తన నివాసంలో ఆమె మంగళవారం రాత్రి ఉరివేసుకుని చనిపోయారు. 

శ్రావణి మనసు మమత, మౌనరాగం సీరియల్స్ లో నటించారు. ప్రేమ వైఫల్యమే శ్రావణి ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు తెలియాల్సి ఉంది.