సినిమాలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సూపర్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ. డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్‌ ఎటాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, తరువాత ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్‌తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌ ఆఫర్స్‌తో బిజగానే ఉంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో హాట్‌ ఫోటోస్‌తో పాటు వర్క్ అవుట్ వీడియోస్‌ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది అదా.

తాజాగా మదర్స్‌ డే సందర్భంగా ఈ భామ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ఓం శాంతి ఓం సినిమాలోని పాటకు అదా డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఈ వీడియోను రికార్డ్ చూశారు. అయితే అది మామూలు డ్యాన్స్‌ కాదు, తాను పడుకొని జిమ్నాస్ట్ స్టైల్‌లో కాళ్లను పూర్తిగా ముఖం దగ్గరకు తీసుకువచ్చి డ్యాన్స్ చేసినట్టుగా వీడియోలో చూపించారు. కానీ అదే వీడియో ఆఖర్లో అసలు విషయాన్ని బయట పెట్టారు. అవి ముఖం అదాది అయితే ఈ వీడియోలోని కాళ్లు ఆమె తల్లివి. అదా వెనకాల కనిపించకుండా ఉన్న తల్లి, తన కాళ్లు అదా కాళ్లలా కదిలిస్తూ అందరిని మాయ చేసింది.

మదర్స్ డే సందర్భంగా ఈ వీడియోను పోస్ట్ చేసి అదా శర్మ అందరికీ షాక్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సోమవారం ఈ బ్యూటీ పుట్టిన రోజును జరుపుకుంటోంది. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన అదాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపుతూ సోషల్ మీడియా మోత మోగిపోతోంది.