Asianet News TeluguAsianet News Telugu

అఖిల్ 4 ఫస్ట్ లుక్.. బాధలో బ్యాచ్‌లర్ కుర్రాడు!

అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ దక్కడం లేదు.  ఫస్ట్ సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా సక్సెస్  అవ్వడం లేదు. డెబ్యూ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు

Most Eligible Bachelor first look
Author
Hyderabad, First Published Feb 8, 2020, 6:24 PM IST

అక్కినేని అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ దక్కడం లేదు.  ఫస్ట్ సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా సక్సెస్  అవ్వడం లేదు. డెబ్యూ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు. ప్రేమ కథలతో అయినా యూత్ ని ఎట్రాక్ట్ చేసి హిట్టందుకుందాం అంటే అది కూడా వర్కౌట్ కావడం లేదు. యూత్ ఫుల్ హీరోలందరు యూత్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఒక స్పెషల్ ఆలోచనతో ముందుకు వెళుతున్నారు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' అంటూ బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక ప్రయోగం చేయబోతున్నాడు. ఆ సినిమాలో ఉండే యూనిక్ పాయింట్ యూత్ ని టార్గెట్ చేస్తుందని సమాచారం. ఫస్ట్ లుక్ లో అఖిల్ సైలెంట్ గా చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వెళుతున్నాడు.   మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో ఉండే 7 అడుగుల్లో మొదటి అడుగు ఇదేనని చెబుతూ కొత్తగా ట్వీట్ చేశాడు. చూస్తుంటే కుర్రాడికి లవ్ దెబ్బ తగిలినట్లు ఉంది.

Most Eligible Bachelor first look

సినిమాకు సంబందించిన షూటింగ్ ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉంది. సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ ఆలోచిస్తున్నారు.  ఇక ఆ సినిమా అనంతరం అఖిల్ కోలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది.  విశాల్ తో అభిమన్యుడు అనే సినిమా చేసిన దర్శకుడు పిఎస్.మిత్రన్ ఇటీవల తమిళ్ లో 'హీరో' అనే సినిమా చేశాడు. రీసెంట్ గా అఖిల్.. దర్శకుడు పిఎస్.మిత్రన్ ని అలాగే హీరో శివకార్తికేయను కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడు మిత్రన్ కొత్త కాన్సెప్ట్ ని అఖిల్ కి వివరించాడట. సినిమాలో అఖిల్ సూపర్ హీరో తరహాలో కనిపించే విధంగా ఒక ఫాంటసీ కథను డిజైన్ చేసుకున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios