Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : ప్రభాస్ సైన్స్ ఫిక్షన్... 2023లోనే ?

ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో భారీ సోషియో ఫాంటసీ మూవీ  చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావటం లేటు అవుతూ వస్తోంది. అయితే వచ్చే నెల నుంచి సెట్స్ మొదలెట్టి నవంబర్ నుంచి షూట్ అనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్దితిల్లో అదీ కష్టమే అని తేలిపోయింది. దాంతో వచ్చే సంవత్సరం ప్రారంభంలో సెట్స్ వేద్దామని డెసిషన్ తీసుకున్నారట. సెట్స్ వేయటానికి మూడు నెలలు పైగా పడుతుందని అంటున్నారు. 
 

More delay for  Prabhas, Nag Ashwin movie
Author
Hyderabad, First Published Jul 6, 2020, 9:56 AM IST

‘సాహో’ తర్వాత ప్రభాస్.. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో భారీ సోషియో ఫాంటసీ మూవీ  చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావటం లేటు అవుతూ వస్తోంది. అయితే వచ్చే నెల నుంచి సెట్స్ మొదలెట్టి నవంబర్ నుంచి షూట్ అనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్దితిల్లో అదీ కష్టమే అని తేలిపోయింది. దాంతో వచ్చే సంవత్సరం ప్రారంభంలో సెట్స్ వేద్దామని డెసిషన్ తీసుకున్నారట. సెట్స్ వేయటానికి మూడు నెలలు పైగా పడుతుందని అంటున్నారు. 

ఇప్పుడే సెట్స్ వేసినా షూటింగ్ ప్రారంభం కాకపోతే అవి పాడవకుండా చూసుకోవాలి. అంతేకాదు ఆ సెట్స్ ఏ స్టూడియోలో వేస్తే వారికి నెలకు ఇంతని రెంట్ కట్టుకుంటూ రావాలి. ఈ పరిస్దితిల్లో బాలీవుడ్ లో కొందరు నిర్మాతలు షూటింగ్ లేనప్పుడు అనవసరంగా రెంట్ కడ్డటం ఎందుకని సెట్స్ కూలగొట్టేస్తున్నారు. ఆ సిట్యువేషన్ కి దూరంగా ఉందామనే వచ్చే సంవత్సరం సెట్స్ వేద్దామనే నిర్ణయానికి అశ్వనీదత్, టీమ్ వచ్చినట్లు సమాచారం. అయితే దీని వల్ల సినిమా షూటింగ్ మరింత లేటు అవుతుంది. 

ఈ క్రమంలో గ్రాఫిక్స్ అన్నీ పూర్తి చేసుకుని రిలీజ్ కు వచ్చేసరికి 2023 వచ్చేస్తుందని మీడియాలో అంచనా వేస్తున్నారు. మొదట 2022 రిలీజ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో సంవత్సరం ముందుకు వెళ్లింది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఏదీ లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పూర్తి చేసారు.అలాగే ఇప్పటికే నాగ్ అశ్విన్‌ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసి లాక్ చేసాడట.  
 
 నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. నిజానికి ప్రభాస్‌ను హీరోగా మా సంస్థ ద్వారా పరిచయం చేయాలనుకున్నాము. కానీ కుదరలేదు. ఈలోగా బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ హీరో గా ఎదిగాడు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్.. ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాసాడు. ఆ స్టోరీ విని నేను  ఆశ్చర్యపోయాను. ప్రభాస్ అయితేనే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందని నాగ్ అశ్విన్ అన్నాడు. ఆ తర్వాత ఈ కథను ప్రభాస్‌కు వినిపించడం.. ఆయన ఓకే చేయడం జరిగింది.  

అందుతున్న సమాచారం మేరకు నాగ్ అశ్విన్- ప్రభాస్ ప్రాజెక్టు కోసం దాదాపు 400 కోట్ల బడ్జెట్ కు రెడీ అవుతున్నారట. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామి ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.  ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కియారా అద్వానీ నటించబోతున్నట్టు సమాచారం.  

Follow Us:
Download App:
  • android
  • ios