మంచు విష్ణు కన్నప్పలో ఇద్దరు పెద్దరాయుళ్ళు.. సినిమాపై పెరుగుతున్న అంచనాలు
మంచువారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈమూవీలో ఒక్కొక్కరుగా స్టార్లు వచ్చి చేరుతున్నారు.
మంచువారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో ఒక్కొక్కరుగా స్టార్లు జాయిన్అవుతున్నారు. మరికొంత మంది స్టార్లు యాడ్ అవ్వబోతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అన్ని భాషల ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి స్టార్లు.. సూపర్ స్టార్లు ఈసినిమాలో నటించబోతున్నారు. ఈక్రమంలో మరోఇద్దరు స్టార్లు తాజాగా కన్నప్ప ఈసినిమాలో యాడ్ అయ్యారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప సినిమా టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది.
స్టార్లు సూపర్ స్టార్లు చేరేవరకు ఈసినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈమూవీలో యూనివర్సల్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్లు కన్నప్ప' ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ మూవీ స్థాయి భారీగా పెరిగింది. ఇప్పుడు ఈ భారీ తారాగణంలోకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, తమిళ విలక్షణ నటుడు శరత్ కుమార్ కూడా చేరారు. సౌత్ లో శరత్ కుమార్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. ఆయన స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా, నటుడిగా క్రేజ్ సాధించుకన్న ఆయన..ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ తో అలరిస్తున్నాడు.
తెలుగులో ఇప్పటికే చాలా ప్రాజెక్ట్స్ లో ఆయన సందడి చేశారు. బన్నీ, భరత్ అనే నేను, జయ జానకీ నాయకా, భగవంత్ కేసరి వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. శరత్ కుమార్ ఇప్పుడు 'కన్నప్ప సినిమాలో భాగం కాబోతున్నారు. అయితేఈయనకు తెలుగులో కన్నప్ప సినిమా మరింత ప్రత్యేకం కాబోతోంది. అయితే ఈమూవీలో మోహన్ బాబు కూడా ఓ పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. శరత్ కుమార్, మోహన్ బాబు వంటి దిగ్గజాలు 'కన్నప్ప' సెట్స్ మీదకు రావడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి.
ఇక ఈసినిమాను బాలీవుడ్ టెలివిజన్ ఫేమ్.. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈయన ప్రత్యేకత ఏంటంటే.. మహాభారతం' సీరియల్ ను అత్యద్భుతంగా డైరెక్ట్ చేసింది ఇతనే. ముఖేశ్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు కెరీర్ లో ఇదొక మైలురాయిగా నిలిచేట్టు రూపొందిస్తున్నారు. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, కథను చెప్పే విధానం, మేకింగ్ తీరు ఇలా అన్నీ కూడా భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేశారట. మరి మంచువారు.. ఈసారి తమ సత్తాను నిరూపించుకుంటారా..? లేక మళ్ళీ ట్రోల్స్ కు గురవుతారా చూడాలి.