పాపులర్ అమెరికన్ మోడల్ కిమ్ కర్దాషియాన్ ( Kim Kardashian) తన భర్త నుంచి త్వరగా డివోర్స్ కోరుకుటోంది. ఇందుకు లాస్ ఏంజిల్స్ లోని సుపీరియర్ కోర్టులో తాజాగా సంబంధిత డాక్యుమెంట్స్ ను దాఖలు చేసింది.  

మోస్ పాపులర్ అమెరికన్ సెలబ్రెటీస్ కిమ్ కర్దాషియాన్ ( Kim Kardashian) తన భర్త నుంచి త్వరగా డివోర్స్ కోరుకుటోంది. ఇందుకు లాస్ ఏంజిల్స్ లోని సుపీరియర్ కోర్టులో తాజాగా సంబంధిత డాక్యుమెంట్స్ ను దాఖలు చేసింది. లాస్ ఏంజెల్స్ కు చెందిన కిమ్ కర్దాషియాన్ అమెరికన్ మీడియా పార్సనాలిటీగా, సోషలిస్టుగా, మోడల్ గా, వ్యాపారవేత్తగా గుర్తింపు పొందింది. ఈమె వయస్సు ప్రస్తుతం 41 ఏండ్లు. ఈమె 2014లో యూనైటెడ్ స్టేట్స్ లోని అట్లాంటకు చెందిన అమెరికన్ రాపర్, రికార్డ్ ప్రొడ్యూసర్ మరియు ఫ్యాషన్ డిజైనర్ కాన్యే వెస్ట్ ని పెండ్లి చేసుకుంది. కాన్యే వెస్ట్ ఎక్కువగా ‘యే’గా గుర్తింపు పొందాడు. వీరి వివాహాం జరిగి ఇప్పటికి ఏండ్లు గడిచింది. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. 

వీరిమధ్య తలెత్తిన ఘర్షణలు, వివాదాలు, మనస్పార్థాల వల్ల తన భర్త నుంచి డివోర్స్ తీసుకోవాలని కిమ్ నిర్ణయించుకుంది. ఇందుకు గతేడాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మొన్న తాజాగా వీలైనంత త్వరగా కాన్యే వెస్ట్‌ నుంచి తనకు విడాకులు ఇప్పంచాలని లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్ట్‌లో పత్రాలను దాఖలు చేసింది. యే విడాకులు ఇచ్చేందుకు షరతులు విధిస్తున్నాడని కూడా తెలిపింది. ముందస్తు ఒప్పందాన్ని మార్చడం, అనవసరమైన మరియు అబద్దపు ఆధారాలతో డివోర్స్ ప్రాసెస్ ను ఆలస్యం చేస్తున్నాడని అభిప్రాయపడింది. యే చేస్తున్న ప్రయత్నాలను పట్టించుకోవద్దని కిమ్ కర్దాషియాన్ కోర్టును కోరారు.

అయితే.. వెస్ట్ మాత్రం వీరి వైవాహిక సంబంధం ముగిసిందనేందుకు తాను అంగీకరించనని స్పష్టం చేసినట్టు కోర్టు ఫైలింగ్ లో పేర్కొంది. కాగా తనకు విడాకులు కావాలని.. మా విడాకులను గోప్యంగా ఉంచాలని కాన్యేను కోరినా.. అతను అలా చేయలేదంటూ కర్దాషియాన్ చెప్పారు. ఈ మేరకు కోర్టు త్వరగా తమకు డివోర్స్ వచ్చే చూడాలని, ఆ దిశ తనకు న్యాయం చేస్తారని నమ్ముతున్నట్టు తెలిపింది. అయితే కర్దాషియాన్ కు గతంలోనూ రెండు సార్లు వివాహామై.. విడాకులు కూడా అయ్యాయి. 2000లో దామన్ థామస్ ను వివాహామాడి 2‌004లో విడిపోయింది. 2011లో క్రిస్ హంప్రిస్ ను మ్యారేజ్ చేసుకొని మళ్లీ 2013లో డివోర్స్ తీసుకుంది. ఆ తర్వాత 2014లో కాన్యే వెస్ట్ తో వెడ్డింగ్ పూర్తి చేసుకొని.. గతేడాది నుంచి సపరేట్ గా ఉంటోంది. ప్రస్తుతం డివోర్స్ కోసం పోరాడుతోంద.